For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Investment: రూ.250 కోట్ల పెట్టుబడి నిర్ణయం.. పరుగులు మెుదలెట్టిన స్టాక్

|

Investment: స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ రేటు పెరగటానికి లేదా క్షీణించటానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే కంపెనీలు తీసుకునే నిర్ణయం వ్యాపార విస్తరణ లేదా అభివృద్ధికి దోహదపడేటట్లయితే ఇన్వెస్టర్లు అలాంటి స్టాక్ కొనేందుకు ఎక్కువ మెుగ్గు చూపుతుంటారు.

చోటా స్టాక్ బడా ఇన్వెస్ట్ మెంట్..

చోటా స్టాక్ బడా ఇన్వెస్ట్ మెంట్..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది స్మాల్ క్యాప్ కంపెనీ వికాస్ లైఫ్‌కేర్ లిమిటెడ్ గురించే. ఈ కంపెనీ షేర్ బుధవారం 6 శాతం మేర లాభపడింది. కంపెనీ తన పెట్టుబడి నిర్ణయాలను వెల్లడించటంతో షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు.

రూ.250 కోట్లు..

రూ.250 కోట్లు..

వికాస్ లైఫ్‌కేర్ లిమిటెడ్ తన పెట్టుబడి నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. కోహినూర్ ఫుడ్స్‌లో రూ.250 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ వార్త తెలియగానే కంపెనీ షేర్లలో ర్యాలీ మెుదలైంది. దీర్ఘకాలిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ పెట్టుబడి నిర్ణయాన్ని బోర్డు తీసుకున్నట్లు స్టాక్ మార్కెట్లకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. 1989లో స్థాపించబడిన కోహినూర్ ఫుడ్స్ దాదాపుగా 60కి పైగా దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీ ప్రధానంగా బాస్మతి బియ్యం, గోధుమ పిండితో పాటు మరిన్ని ఉత్పత్తులను విక్రయిస్తోంది.

కంపెనీ ఎండీ..

కంపెనీ ఎండీ..

కోహినూర్ ఫుడ్స్‌లో పెట్టుబడి నిర్ణయంపై MD SK ధావన్ సంతోషం వ్యక్తం చేశారు. బాస్మతి బియ్యం, ప్రాసెస్డ్ ఫుడ్స్ పరిశ్రమలో కంపెనీకి మంచి స్థానం ఉంది. FMCG రంగంపై కూడా కంపెనీ దృష్టి సారించిందన్న విషయం ఈ పెట్టుబడితో స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా కంపెనీ మూడో త్రైమాసికంలో కంపెనీ నికర ఆదాయం 74.59 శాతం మేర పెరిగి రూ.34,626.48 లక్షలకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.19,833.44 లక్షలుగా ఉంది.

పెరిగిన లాభం..

పెరిగిన లాభం..

మూడో త్రైమాసికంలో వికాస్ లైఫ్‌కేర్ లిమిటెడ్ లాభం కూడా పెరిగింది. ఈ కాలంలో కంపెనీ రూ.1,129.79 లక్షల నికర లాభాన్ని ఆర్జించింది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.565.29 లక్షలుగా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.679.01 కోట్లుగా ఉండగా. స్టాక్ ధర రూ.6.31 శాతం పెరిగిన తర్వాత రూ.4.44 వద్ద ముగిసింది.

English summary

Investment: రూ.250 కోట్ల పెట్టుబడి నిర్ణయం.. పరుగులు మెుదలెట్టిన స్టాక్ | Vikas life Sciences share price rose with investing 250 crores in kohinoor foods

Vikas life Sciences share price rose with investing 250 crores in kohinoor foods
Story first published: Thursday, January 26, 2023, 12:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X