కార్లు, బైక్స్‌పై భారీగా డిస్కౌంట్, ఆఫర్లు ఇచ్చినా.. పెరగని సేల్స్
ఆర్థిక మందగమనం కారణంగా 2019లో ఆటో సేల్స్ భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కూడా సేల్స్ తగ్గిపోయాయి. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని ఆటో ప్లాంట్స్ తాత్కాలికంగా మూతబడ్డాయి. మందగమనం నేపథ్యంలో మోడీ ప్రభుత్వం వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించింది. ఆటోరంగానికి కూడా ఇచ్చింది. అయినప్పటికీ డిసెంబర్ నెలలో సేల్స్ తగ్గాయి.
షాకింగ్: ఉద్యోగం లేనివారు, సరైన వేతనాల్లేనివారు 50 కోట్ల..

ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నప్పటికీ..
ఆటోమొబైల్స్ రిటైల్ సేల్స్ వరుసగా రెండో నెల తగ్గిపోయాయి. పండుగలు, కొత్త సంవత్సరం, కేంద్ర ప్రభుత్వ ఉద్దీపనల సందర్భంగా వివిధ ఆటో మొబైల్ సంస్థలు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఇచ్చాయి. అయినప్పటికీ సేల్స్ మాత్రం పెరగలేదు. ముంబైలో రీజినల్ ట్రాన్సుపోర్ట్ ఆఫీస్ (RTO) కార్యాలయంలో రిజిస్టరైన వాహనాలు గత ఏడాది డిసెంబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్‌లో 15 శాతం తగ్గాయి. RTO కార్యాలయంలో రిజిస్టర్ అయ్యే వాహనాల సంఖ్యను రిటైల్ సేల్స్‌కు కొలమానంగా చెప్పవచ్చు.

త్రీవీలర్ సేల్స్ పెరిగాయి
మందగమనం ప్రభావం 2018 డిసెంబర్ సమయంలో ప్రారంభమైంది. దీంతో అప్పుడు తగ్గింది. గత ఏడాది ఇదే నెలలో తగ్గడంతో తాజా తగ్గుదల పెద్దగా కనిపించడం లేదు అంతే. త్రీవీలర్స్ వెహికిల్ సేల్స్ తప్పితే మిగతా అన్ని రకాల వాహనాల సేల్స్ రిజిస్ట్రేషన్స్ పడిపోయాయి.

ఆఫర్లు ఇచ్చినా..
డిస్కౌంట్లు, ఆఫర్లు ఉన్నప్పటికీ సేల్స్ ఇలా తగ్గడాన్ని తాము ఊహించలేదని వెహికిల్ రిటైలర్స్ చెబుతున్నారు. దసరా, దీపావళి నుంచి ఆఫర్లు కొనసాగుతున్నాయని, దీనిని డిసెంబర్ నెలలోను పొడిగించామని చెబుతున్నారు. కానీ పెరగలేదని అంటున్నారు.

ఏవి ఎంత శాతం తగ్గాయంటే?
2019 డిసెంబర్ నెలలో ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 9 శాతం, కమర్షియల్ వెహికిల్ సేల్స్ 21 శాతం, టూ వీలర్ సేల్స్ 16 శాతం తగ్గిపోయాయి. త్రీవీలర్ సేల్స్ మాత్రం 1 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications