2020లో ప్రపంచంలో నిరుద్యోగులు మరో 25 లక్షల మేరకు పెరగనున్నారని ఐక్య రాజ్య సమితి అంచనా. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగులు 50 కోట్లకు చేరుకుంటారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) నివేదిక వెల్లడించింది. ఓ వైపు కార్మికులు పెరుగుతుంటే, మరోవైపు ఉపాధి తగ్గుతోందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అసమానతలు, వివక్ష కూడా కొనసాగుతోందని పేర్కొంది. లక్షలాదిమంది సామాన్యులకు ప్రస్తుతం చేస్తోన్న పనితో జీవితాన్ని మెరుగుపరుచుకోవడం కష్టంగా మారిందని ILO డైరెక్టర్ జనరల్ గయ్ రైడర్ అన్నారు.

ఉద్యోగాల్లేవు.. సరైన ఉద్యోగాలు
ILO ది వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ ఔట్ లుక్: ట్రెండ్స్ 2020 పేరుతో నివేదిను విడుదల చేసింది. కార్మికులు మెరుగైన పనిని, జీవితాన్ని వెతుక్కోవడానికి పని సంబంధిత అసమానతలు, తొలగింపులు ప్రధాన అడ్డంకిగా మారాయని తెలిపింది. ప్రపంచంలో ప్రస్తుతం 188 మిలియన్ల (18.8 కోట్లు) మంది నిరుద్యోగులు ఉన్నారని, 16.5 కోట్ల మందికి సరైన ఉద్యోగాలు లేవని లేదా సరైన వేతనాలు పేర్కొంది. 28.5 కోట్ల మంది నిరుద్యోగులు లేదా తక్కువ వేతనాలు ఉన్నాయి.

నిరుద్యోగం లేదా సరైన వేతనం లేని వారు 47 కోట్ల మంది
12 కోట్ల మంది ఉద్యోగం కోసం వెతకడం మానేశారు లేదా వారికి ఉద్యోగ ప్రవేశాలకు సరైన అవకాశాలు లభించడం లేదని ఈ నివేదిక తెలిపింది. పైవాటిని పరిగణలోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగం లేకపోవడం లేదా తక్కువ వేతనం కారణంగా ప్రభావితమైన వారు 47 కోట్లకు పైగా ఉన్నారు.

మార్కెట్లోకి వస్తే ఉద్యోగాల్లేవు
గత దశాబ్దకాలంగా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య దాదాపు స్థిరంగా ఉంది. కానీ 2019లో ఆర్థిక మందగమనం నేపథ్యంలో కొత్తగా చదువులు పూర్తయి మార్కెట్లోకి వచ్చే వారికి తగినన్ని ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని పేర్కొంది.

63 కోట్ల మంది పేద కార్మికులు
ప్రస్తుతం రోజుకు 3.20 డాలర్ల (దాదాపు రూ.227) కంటే తక్కువ ఆర్జించేవారు పేద కార్మికుల పరిధిలోకి వస్తారు. ప్రపంచవ్యాప్తంగా వీరు 63 కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు పేద కార్మికుడు. ఈ రెండేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేద కార్మికులు మరింత పెరగవచ్చునని అంచనా. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యానికి ఈ పరిణామం మరింత అవరోధంగా భావిస్తున్నారు.

పెరగనున్న నిరుద్యోగం
నిరుద్యోగులుగా నమోదు చేసుకున్న వారి సంఖ్య 2019లో 18.8 కోట్ల నుంచి 19.05 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 24 ఏళ్లలో ఉన్న 26.7 కోట్ల మంది ఉద్యోగం, విద్య లేదా శిక్షణలో గానీ లేరు. చాలామంది పని చేసే చోట దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మెరుగైన జీవితం కోసం కష్టపడుదామనుకుంటున్న లక్షలాది మంది సామాన్యులకు పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయని పేర్కొంది. ఆఫ్రికన్ దేశాల్లో ఆదాయాలు తగ్గిపోయి పేదరికం పెరిగిందని తెలిపారు.

క్లుప్తంగా...
- ప్రపంచంలోని నిరుద్యోగుల సంఖ్య 18.80 కోట్లు
- సరైన వేతనంలేని లేదా చేతి నిండా పని లేని వారు 16.5 కోట్లు
- పనికోసం వెతకడం మానేసిన వారు లేదా పని ప్రదేశాలు అందుబాటులో లేనివారు 12 కోట్లు
- ఉపాధి అవకాశాలు లేనివారు లేదా అంతంత మాత్రంగా ఉన్నవారు మొత్తం 47 కోట్లు
- సరైన వేతనం లభించని వారు 63 కోట్లమంది
-15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న 26.7 కోట్ల మంది యువతకు ఉపాధి, విద్య లేదా శిక్షణ అందుబాటులో లేవు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications