ముంబై: ఫ్యాషన్ సెగ్మెంట్‌కు చెందిన మరో బిగ్ కంపెనీ.. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేయనుంది. ఇప్పటిదాకా ఇదే సెగ్మెంట్ నుంచి వచ్చిన పబ్లిక్ ఇష్యూలు సక్సెస్ అయ్యాయి. ఇన్వెస్టర్లకు భారీ రిటర్న్స్‌ను అందించాయి. ఫలితంగా- ఈ ఐపీఓపైనా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం మార్కెట్ స్లంప్‌లో ఉన్నందున.. దాని ప్రభావం ఏదైనా పడుతుందా?.. అనే అనుమానాలు మార్కెట్ వర్గాల్లో లేకపోలేదు.

వేదాంత్ ఫ్యాషన్స్..
ఆ కంపెనీ- వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్. మాన్యవర్ బ్రాండ్ పేరుతో అవుట్ లెట్లను నడిపిస్తోంది ఈ కంపెనీయే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మాన్యవర్ అవుట్ లెట్స్ ఉన్నాయి. సక్సెస్ ఫుల్ బ్రాండ్‌గా ఈ సెగ్మెంట్‌లో గుర్తింపును పొందింది. 3,149 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇన్వెస్టర్ల నుంచి సమీకరించుకోవడానికి పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది.

4న ఓపెనింగ్
ఫిబ్రవరి 4వ తేదీన వేదాంత్ ఫ్యాషన్స్ ఐపీఓ ఓపెన్ అవుతుంది. 8వ తేదీన ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ 824 నుంచి 866 రూపాయల వరకు నిర్దారించింది కంపెనీ యాజమాన్యం. గ్రే మార్కెట్ ప్రీమియం అంచనాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ప్రస్తుతం 105 రూపాయలుగా జీఎంపీ నిర్ధారితమైంది. పబ్లిక్ ఇష్యూ ఓపెన్ అయినప్పుడు మార్పులు ఉండొచ్చు. మొత్తంగా 3,149 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలనే లక్ష్యంతో వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ ఈ పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది.

లాట్ సైజు ఇదీ...
ఈ ఐపీఓ లాట్ సైజు 17. అంటే పెట్టుబడిదారులు కనీసం 17 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే 14,722 రూపాయలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో బిడ్డర్ ఒకేసారి గరిష్ఠంగా 13 లాట్స్ వరకు అప్లికేషన్‌ను దాఖలు చేయవచ్చు. దీని విలువ 1,91,386 రూపాయలు. ఫిబ్రవరి 11వ తేదీన షేర్ల అలాట్‌మెంట్ ఉంటుంది. అలాట్‌మెంట్ దక్కని వారికి 14వ తేదీ నుంచి బిడ్డింగ్ మొత్తాన్ని రీఫండ్ చేస్తుందీ కంపెనీ. అదే నెల 16వ తేదీన బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లల్లో ఈ ఐపీఓ లిస్టింగ్ అవుతుంది.

ఫ్యాషన్ సెగ్మెంట్ కావడంతో..
ఫ్యాషన్ సెగ్మెంట్‌కు సంబంధించిన ఐపీఓ కావడం వల్ల ఓ మోస్తరు అంచనాలే ఉన్నాయి. ఇదివరకు ఇదే సెగ్మెంట్ నుంచి గత సంవత్సరం గో ఫ్యాషన్స్ పబ్లిక్ ఇష్యూకు వచ్చిన విషయం తెలిసిందే. పెట్టిన పెట్టుబడిపై 50 శాత కంటే అధికంగా రిటర్న్స్ ఇచ్చింది గో ఫ్యాషన్స్. మార్కెట్ స్లంప్‌లో ఉన్నప్పటికీ.. తన కటాఫ్ ప్రైస్‌కు తగ్గట్లేదు. ఫలితంగా- వేదాంత్ ఫ్యాషన్స్‌పైనా మంచి అంచాలనే పెట్టుకున్నారు రిటైల్ ఇన్వెస్టర్లు. రవి మోడీ, శిల్పి మోడీ ఈ కంపెనీ ప్రమోటర్లు. మాన్యవర్‌తో పాటు త్వమేవ్, మంథన్, మహోయ్, మెబాజ్ బ్రాండింగ్‌లను ప్రమోట్ చేస్తోన్నారు.

546 అవుట్‌లెట్స్..
గత ఏడాది సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా 546 ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్‌లెట్స్ ఉన్నాయి వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్‌కు. అమెరికా, కెనడ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లల్లో 11 ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లను కూడా నెలకొల్పింది. తన వ్యాపార కార్యకలాపాల పరిధిని మరింత విస్తరించుకోవడంలో భాగంగా పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది. యాక్సిస్ క్యాపిటల్, ఈడిల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్ర క్యాపిటల్ ఐపీఓ జారీని పర్యవేక్షిస్తాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications