Manyavar: తొలిరోజు అంతంతే: దెబ్బకొట్టి స్లంప్: రిటైలర్లలో తగ్గిన ఆసక్తి
ముంబై: ఫ్యాషన్ సెగ్మెంట్‌కు చెందిన మరో బిగ్ కంపెనీ.. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కు వచ్చింది. ఇప్పటిదాకా ఇదే సెగ్మెంట్ నుంచి వచ్చిన పబ్లిక్ ఇష్యూలు సక్సెస్ అయ్యాయి. ఇన్వెస్టర్లకు భారీ రిటర్న్స్‌ను అందించాయి. ఫలితంగా- ఈ ఐపీఓపైనా మంచి అంచనాలే ఏర్పడాల్సి ఉన్నప్పటికీ.. దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుతం మార్కెట్ స్లంప్‌లో ఉన్నందున.. దాని ప్రభావం పడినట్టేనని అనుమానాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.

ఐపీఓ 8న క్లోజ్..
ఆ కంపెనీ- వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్. మాన్యవర్ బ్రాండ్ పేరుతో అవుట్ లెట్లను నడిపిస్తోంది ఈ కంపెనీయే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మాన్యవర్ అవుట్ లెట్స్ ఉన్నాయి. సక్సెస్ ఫుల్ బ్రాండ్‌గా ఈ సెగ్మెంట్‌లో గుర్తింపును పొందింది. 3,149 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇన్వెస్టర్ల నుంచి సమీకరించుకోవడానికి పబ్లిక్ ఇష్యూను జారీ చేసింది. శుక్రవారం ఐపీఓ ఓపెన్ అయింది. మంగళవారం ముగుస్తుంది.

తొలి రోజు అనాసక్తి..
ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 824 నుంచి 866 రూపాయలుగా నిర్దారించింది కంపెనీ యాజమాన్యం. గ్రే మార్కెట్ ప్రీమియం అంచనాలు పెద్దగా లేవు. మొదట్లో 105 రూపాయలుగా జీఎంపీ నిర్ధారితమైంది. పబ్లిక్ ఇష్యూ ఓపెన్ అయిన తరువాత ఈ సంఖ్య భారీగా క్షీణించింది. 45 రూపాయలకు పడిపోయింది. ఈ పబ్లిక్ ఇష్యూ కోసం తొలి రోజు 14 శాతం వరకు మాత్రమే బిడ్డింగ్స్ దాఖలయ్యాయి. 2,54,55,388 షేర్లను కంపెనీ యాజమాన్యం జారీ చేయగా.. 35,32,872 బిడ్స్ మాత్రమే దాఖలయ్యాయి. సోమ, మంగళవారాల్లో దాఖలయ్యే బిడ్డింగ్స్ మీద దీని సక్సెస్ రేట్ ఆధారపడి ఉంది.

రిటైల్ పోర్షన్ 22 శాతం మాత్రమే..
మాన్యవర్-వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూలను కొనుగోలు చేయడానికి రిటైల్ ఇన్వెస్టర్లు తొలి రోజు పెద్దగా ఆసక్తి చూపలేదు. 22 శాతం మాత్రమే ఈ పోర్షన్ ఫిల్ అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్ల నుంచీ పెద్దగా స్పందన రాలేదు. ఆరు శాతం మాత్రమే తొలి రోజు క్యూఐబీల నుంచి బిడ్స్ దాఖలయ్యాయి. నాన్ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్ల పరిస్థితీ ఇంతే. ఈ సెగ్మెంట్ నుంచి కూడా ఆరు శాతం మాత్రమే బిడ్స్ అందాయి.

లాట్ సైజు ఇదీ...
ఈ ఐపీఓ లాట్ సైజు 17. అంటే పెట్టుబడిదారులు కనీసం 17 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే 14,722 రూపాయలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో బిడ్డర్ ఒకేసారి గరిష్ఠంగా 13 లాట్స్ వరకు అప్లికేషన్‌ను దాఖలు చేయవచ్చు. దీని విలువ 1,91,386 రూపాయలు. ఫిబ్రవరి 11వ తేదీన షేర్ల అలాట్‌మెంట్ ఉంటుంది. అలాట్‌మెంట్ దక్కని వారికి 14వ తేదీ నుంచి బిడ్డింగ్ మొత్తాన్ని రీఫండ్ చేస్తుందీ కంపెనీ. అదే నెల 16వ తేదీన బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లల్లో ఈ ఐపీఓ లిస్టింగ్ అవుతుంది.

ఫ్యాషన్ సెగ్మెంట్ కావడంతో..
ఫ్యాషన్ సెగ్మెంట్‌కు సంబంధించిన ఐపీఓ కావడం వల్ల ఓ మోస్తరు అంచనాలే ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ నుంచి గత సంవత్సరం గో ఫ్యాషన్స్ పబ్లిక్ ఇష్యూకు వచ్చిన విషయం తెలిసిందే. పెట్టిన పెట్టుబడిపై 50 శాత కంటే అధికంగా రిటర్న్స్ ఇచ్చింది గో ఫ్యాషన్స్. మార్కెట్ స్లంప్‌లో ఉన్నప్పటికీ.. తన కటాఫ్ ప్రైస్‌కు తగ్గట్లేదు. ఈ రెండింటితో పోల్చి చూసుకుంటే- మాన్యవర్‌కు తొలి రోజు అందిన ఆదరణ చాలా తక్కువ. మాన్యవర్‌తో పాటు త్వమేవ్, మంథన్, మహోయ్, మెబాజ్ బ్రాండింగ్‌లను ప్రమోట్ చేస్తోందీ కంపెనీ.

546 అవుట్‌లెట్స్..
గత ఏడాది సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా 546 ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్‌లెట్స్ ఉన్నాయి వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్‌కు. అమెరికా, కెనడ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లల్లో 11 ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లను కూడా నెలకొల్పింది. తన వ్యాపార కార్యకలాపాల పరిధిని మరింత విస్తరించుకోవడంలో భాగంగా పబ్లిక్ ఇష్యూను జారీ చేసింది. యాక్సిస్ క్యాపిటల్, ఈడిల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్ర క్యాపిటల్ ఐపీఓ జారీని పర్యవేక్షిస్తున్నాయి.


Click it and Unblock the Notifications