Amazon Layoffs: తొలగింపులతో బెంబేలెత్తిస్తున్న అమెజాన్.. మళ్లీ ఉద్యోగుల బలి..!
Amazon Layoffs: కొత్త ఎడాదిలో నెలల మారుతున్న కొద్దీ కంపెనీలకు కష్టాలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రతినెల వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ దిగ్గజ కంపెనీలు తమను తాము కాపాడుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. మాంద్యం దృష్ట్యా కంపెనీలు తీవ్ర కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఈ క్రమంలోనే అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ సోమవారం మరోసారి ఉద్యోగుల కోతలను ప్రకటించింది. ఈ సారి రౌండ్ లో దాదాపు 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు టెక్ కంపెనీ సోమవారం సంచలన ప్రకటన చేసింది. మైక్రోసాఫ్ట్ కార్ప్, సేల్స్‌ఫోర్స్ ఇంక్, ఆల్ఫాబెట్, మెటా ప్లాట్‌ఫారమ్, డిస్నీలతో సహా అనేక టెక్ దిగ్గజాలు ఇటీవలి నెలల్లో తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గిస్తూ వచ్చాయి.

తాజా తొలగింపులపై కంపెనీ సీఈవో స్పందించారు. గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ భారీ మొత్తంలో సిబ్బందిని జోడించిందని.. అయితే అనిశ్చిత ఆర్థిక వ్యవస్థ కారణంగా ఖర్చులతో పాటు హెడ్‌కౌంట్ కోతలను ఎంచుకోవలసి వచ్చిందని CEO ఆండీ జాస్సీ వెల్లడించారు. కంపెనీకి చెందిన క్లౌడ్ సర్వీసెస్, యాడ్స్, ట్విచ్ యూనిట్లలో ఈ సారి తొలగింపులు ఉండనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సమీప భవిష్యత్తులో ఉన్న అనిశ్చితి కారణంగా తాజా క్రమబద్ధీకరణ జరుగుతోందని ఒక ప్రకటనలో జాస్సీ తెలిపారు.
ప్రస్తుత త్రైమాసికంలో ఆపరేటింగ్ లాభం క్షీణించవచ్చని అమెజాన్ గత నెలలో పేర్కొంది. వినియోగదారులు, క్లౌడ్ కస్టమర్ల ఆర్థిక ప్రభావంతో ఖర్చులను తగ్గించింది. నాల్గవ త్రైమాసికంలో కంపెనీకి లాభదాయకమైన క్లౌడ్-కంప్యూటింగ్ విభాగం నుంచి అమ్మకాలు మందగించాయి. అమెజాన్ యజమానుల కోసం దాని వర్చువల్ ప్రైమరీ కేర్ ఆఫర్ వంటి సేవలను వెనక్కి తగ్గించింది లేదా మూసివేసింది. ఈ కారణాల నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లలో అమెజాన్ షేర్ స్వల్పంగా నష్టాల్లో ముగిసింది.


Click it and Unblock the Notifications