రానున్న బడ్జెట్‌లో వర్క్ ఫ్రమ్ హోం చేసే వేతన ఉద్యోగస్తులకు ప్రభుత్వం కాస్త ఊరట కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనావైరస్‌తో దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో చాలా ఆఫీసులకు మూతపడ్డాయి. దీంతో వర్క్ ఫ్రం హోమ్ అనే కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. ఇంటి నుంచి పనిచేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తమ ఉద్యోగస్తులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి.
అయితే ఉద్యోగస్తులకు ఆయా సంస్థలు ఇచ్చిన అలవెన్సులపై కూడా పన్ను పడుతోంది. అంటే కాస్ట్ టూ కంపెనీ కాకుండా ఇతర అలవెన్సులు అంటే ఇంటి అద్దె, యూనిఫారం అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, మీల్ కూపన్స్, వోచర్ల పై పన్ను అధికంగానే ఉంటోంది. ఇంటి నుంచి పనిచేసే వారిపై కూడా ఈ పన్ను విధించడం జరుగుతోంది.

అయితే చిన్న లేదా మధ్య తరహాలు పన్ను చెల్లించే పన్నుదారులకు ఈ సమయంలో వీటిపై పన్ను లేకుండా చూస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంటి నుంచి పనిచేస్తున్నప్పుడు వేతనం పొందే ఉద్యోగస్తులకు పలు అలవెన్సులపై మినహాయింపు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. ఒక వేళ ఆఫీసులకు వచ్చి అక్కడి సదుపాయాలు వినియోగించుకుంటున్నట్లయితే పన్ను విధించడం సబబుగానే ఉంటుందని అయితే ఇంటి నుంచి పనిచేస్తున్న నేపథ్యంలో పన్ను మినహాయింపు ఇస్తే ఉద్యోగస్తులకు ఆ డబ్బు ఆదా అవుతుందని టాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లాక్‌డౌన్ కారణంగా ఇంటి నుంచి పనిచేయాల్సి రావడంతో ఉద్యోగస్తులు అదనపు ఖర్చులు చేతినుంచి పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు.అయితే చాలా కంపెనీలు ఈ డబ్బులను రీఇంబర్స్ చేశాయి.అయితే ఇలాంటి రీఇంబర్స్‌మెంట్‌పై కూడా పన్నులు విధించడం బాధాకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో కొంత ఊరట కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్‌డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications