అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన 50% టారిఫ్ ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రభావం భారత్‌కు పెద్ద దెబ్బే. ఎందుకంటే అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల్లో దాదాపు 2/3 వంతు డైరెక్ట్ గా ప్రభావితం అవుతోంది. అంటే సుమారు 48 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఈ టారిఫ్‌ల ప్రభావం వల్ల భారత్‌కి, కోవిడ్ కన్నా దారుణమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.

ఈ 50% టారిఫ్ రెండు విడతల్లో అమల్లోకి వచ్చింది. మొదట జూలైలో 25% బేస్ డ్యూటీని ప్రకటించారు. తర్వాత ఆగస్టులో అదనంగా 25% పెనాల్టీ డ్యూటీ విధించారు. కారణం భారత్ ఇంకా రష్యా నుండి చమురు, రక్షణ సామగ్రి కొనుగోలు చేస్తుంది కాబట్టి దీనికి అమెరికా వ్యతిరేకిస్తోంది. అందుకే పెనాల్టీ రూపంలో రెండో టారిఫ్ జోడించారు. ఇది ఆగస్టు 27 ఉదయం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. అయితే కొన్ని రంగాలకు మాత్రం మినహాయింపులు ఇచ్చారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ (30% ఎగుమతులు) టారిఫ్ ఫ్రీగా ఉన్నాయి. ఆటో పార్ట్స్‌పై 25% పన్ను, మిగతా అన్ని వస్తువులపై నేరుగా 50% పన్ను విధించారు. దీని వలన అమెరికా మార్కెట్లో భారత వస్తువులు ఖరీదై, కోనే శక్తి తగ్గిపోతోంది.
ఈ కొత్త టారిఫ్ వల్ల భారత్‌లోని ప్రధాన ఎగుమతి రంగాలు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. ముఖ్యంగా టెక్స్టైల్స్, దుస్తులు ($10.9 బిలియన్), వజ్రాలు, రత్నాలు, జ్యువెలరీ ($10 బిలియన్), మెషినరీ, అప్లయెన్సెస్ ($6.7 బిలియన్), వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్ ($6 బిలియన్), స్టీల్, అల్యూమినియం, కాపర్ ($4.7 బిలియన్), ఆర్గానిక్ కెమికల్స్ ($2.7 బిలియన్), సముద్ర ఆహారం, రొయ్యలు ($2.4 బిలియన్), అలాగే హ్యాండిక్రాఫ్ట్స్, కార్పెట్స్, లెదర్, ఫర్నిచర్ ($5 బిలియన్‌కి పైగా) వంటి రంగాలు ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. తిరుపూర్ (టెక్స్టైల్స్), నోయిడా (అపారెల్), సూరత్ (డైమండ్స్), విశాఖ (సముద్ర ఆహారం), జోధ్‌పూర్ (హ్యాండిక్రాఫ్ట్స్) వంటి పరిశ్రమా కేంద్రాలు గట్టిగా దెబ్బతింటున్నాయి. క్రిసిల్ రేటింగ్స్ అంచనా ప్రకారం కొన్ని రంగాల్లో 70% వరకు ఎగుమతులు తగ్గిపోవచ్చు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 43% పడిపోవచ్చు.
తగ్గిన భారత్ మార్కెట్ షేర్‌ని ఇతర దేశాలు లాభంగా మలుచుకుంటాయి. ముఖ్యంగా వియత్నాం, బంగ్లాదేశ్, చైనా, టర్కీ, ఇండోనేషియా, మెక్సికో దేశాలు అమెరికా మార్కెట్లో మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. ఇవి ఇప్పటికే తక్కువ ధరలకు వస్తువులు సరఫరా చేస్తుండగా, భారత వస్తువులు ఖరీదయ్యే సరికి ఈ దేశాలు డిమాండ్‌ను తీరుస్తాయి.
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం రూ. 25,000 కోట్ల ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ప్రకటించింది. దీని కింద ఎగుమతిదారులకు సులభ రుణాలు (ట్రేడ్ ఫైనాన్స్, క్రెడిట్ సపోర్ట్), టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు GST మార్పులు, జ్యువెలరీ వంటి రంగాలకు టారిఫ్‌లో కొంత రీయింబర్స్‌మెంట్ సహాయం, SEZలలో సంస్కరణలు, అలాగే బ్రాండ్ ఇండియా పేరుతో గ్లోబల్ ఈ-కామర్స్, వేర్‌హౌసింగ్ ప్రోత్సాహం ఉన్నాయి. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, అమెరికాపై ప్రతీకార చర్యలు ఉండవు కానీ ఎగుమతిదారులు, ఉద్యోగాలను రక్షించడానికి పాలసీ, ఫిస్కల్, డిప్లొమాటిక్ అన్ని మార్గాలు ఉపయోగిస్తామని తెలిపారు.
భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం బిలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ (BTA) పై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆగస్టు 25న జరగాల్సిన కీలక సమావేశం వాయిదా పడింది. దీంతో వేగం తగ్గింది. ఇంతలో భారత్ అమెరికాపై ఆధారాన్ని తగ్గించడానికి యూరోపియన్ యూనియన్, యూకే, ఇతర దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (FTAs) పూర్తిచేయడానికి ప్రయత్నిస్తోంది.
మొత్తంగా, అమెరికా కొత్త టారిఫ్ భారత్‌కు పెద్ద సవాలు. ముఖ్యంగా టెక్స్టైల్, జ్యువెలరీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఎగుమతి ప్రోత్సాహక పథకాలతో, ఇతర దేశాలతో కొత్త ఒప్పందాల ద్వారా నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
More From GoodReturns

LPG: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..



Click it and Unblock the Notifications