For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stock Market: ఈ వారం గమనించాల్సిన విషయాలివే.. ట్రేడర్స్ బీ అలర్ట్..

|

Stock Market: రానున్న వారంలో స్టాక్ మార్కెట్ల పనితీరును ఫిబ్రవరి 22న విడుదలయ్యే ద్రవ్య విధాన సమావేశ మినిట్స్ ప్రభావితం చేయనున్నాయి. దీనికి తోడు ఫిబ్రవరి 24న ఫారిన్ ఎక్స్ఛేంజ్ రిజర్వ్‌ల డేటా బయటికి వస్తుందని ట్రేడర్లు ఆసక్తిగా వేచి ఉన్నారు. ఇదే సమయంలో బ్యాంక్ డిపాజిట్ల సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

US మార్కెట్ డేటా..

US మార్కెట్ డేటా..

ఫిబ్రవరి 20న US మార్కెట్‌లు మూసి ఉండనున్నాయి. ఫిబ్రవరి 21న ప్రస్తుత గృహ విక్రయాలు, ఫిబ్రవరి 22న రెడ్‌బుక్, FOMC మినిట్స్,API క్రూడ్ ఆయిల్ స్టాక్, GDP గ్రోత్ రేట్, EIA క్రూడ్ వంటి వాటిపై దృష్టి సారిస్తారు. ఫిబ్రవరి 23న ఆయిల్ స్టాక్స్, కోర్ PCE ధరల సూచిక, కొత్త గృహ విక్రయాలు, ఫిబ్రవరి 24న బేకర్ హ్యూస్ ఆయిల్ రిగ్ కౌంట్ వివరాలు కీలకంగా మారనున్నాయి.

విదేశీ పెట్టుబడులు..

విదేశీ పెట్టుబడులు..

ఈ ఏడాది ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్ల పనితీరు తక్కువగా ఉంది. ఏడాది ప్రాతిపదికన నిఫ్టీ సూచీ 1.4 శాతం మేర తగ్గిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డా.వి.కె.విజయకుమార్ వెల్లడించారు. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు తమ సంపదను భారత మార్కెట్ల నుంచి చైనా, తైవాన్, హాంగ్ కాంగా, దక్షిణ కొరియా వంటి మార్కెట్లకు తరలిస్తున్నారు. చౌక మార్కెట్లలో తక్కువ ధరల వద్ద ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను పొందాలని విదేశీ మదుపరులు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

నిఫ్టీ టెక్నికల్ అవుట్‌లుక్..

నిఫ్టీ టెక్నికల్ అవుట్‌లుక్..

గత వారం చివరగా నిఫ్టీ సూచీ స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ముగించింది. నిఫ్టీ స్వల్పకాలిక ధోరణి బలహీనమైన పక్షపాతంతో అస్థిరంగా ఉంది. ప్రస్తుత బలహీనత ఇప్పటి వరకు మార్కెట్ సమీప-కాల అప్‌ట్రెండ్ స్థితిని దెబ్బతీయలేదు. రానున్న వారంలో దాదాపు 17800 స్థాయిల దిగువ మద్దతు నుంచి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నట్లు తాము భావిస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లోని టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు. ఎగువన 18150 మార్కును రెసిస్టెంట్ గా పనిచేస్తుందని అన్నారు.

Read more about: stock market nse bse sensex nifty 50
English summary

Stock Market: ఈ వారం గమనించాల్సిన విషయాలివే.. ట్రేడర్స్ బీ అలర్ట్.. | Traders should know key factors that may impact Indian stock markets next week

Traders should know key factors that may impact Indian stock markets next week
Story first published: Sunday, February 19, 2023, 16:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X