అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గేది లేదంటున్నారు. చైనా వాణిజ్య రంగంపై భారీగా సుంకాలు విధించిన అగ్రరాజ్య అధినేత మరోమారు ఈయూ దేశాలపై సుంకాలతో విరుచుకుపడిన సంగతి విదితమే. తాజాగా మళ్లీ సుంకాలపై కీలక నిర్ఱయం తీసుకున్నారు. ట్రంప్ సుంకాల దెబ్బ ఈ సారి భారత్ ను తాకింది. భారత ఉక్కు పరిశ్రమపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. వందలాది మంది రోడ్డు పడనున్నారు.
పెన్సిల్వేనియాలో గత వారం జరిగిన ఒక ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపై సుంకాలను 25 శాతం నుండి 50 శాతానికి పెంచుతామని ప్రకటించారు. అన్నట్లుగానే అమెరికా అధ్యక్షుడు మంగళవారం ఉక్కు అల్యూమినియం దిగుమతులపై సుంకాలను 50%కి రెట్టింపు చేస్తూ ప్రకటనపై సంతకం చేశారు. దీంతో అమెరికాలో ఉక్కు, అల్యూమినియంపై సుంకాలు బుధవారం నుండి రెట్టింపు అయ్యాయి. జాతీయ భద్రతను కాపాడటానికి, దేశీయ పరిశ్రమను గాడిలో పెట్టడానికి ఈ నిర్ణయం చాలా ముఖ్యమని శ్వేతసౌధం చెబుతోంది.

అయితే, దిగుమతి చేసుకున్న లోహాలపై ఆధారపడిన చాలా మంది యుఎస్ తయారీదారులకు, కొత్త సుంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ భారీగా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. నిర్మాణ రంగం నుండి వంట సామాగ్రి వరకు అన్ని రంగాలలో ఈ సుంకాల నిర్ణయం ఉద్యోగాలకు ముప్పు కలిగిస్తున్నాయని ది వాషింగ్టన్ పోస్ట్‌లోని ఒక నివేదిక తెలిపింది.భారతదేశ ఎగుమతి రంగంతో సహా ప్రపంచ వాణిజ్యంపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) డేటా ప్రకారం.. భారతదేశం 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు సుమారు $4.56 బిలియన్ల విలువైన ఉక్కు, అల్యూమినియం అనుబంధ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్న చిన్న, మధ్య తరహా తయారీదారుల నుండి ఈ ఉత్పత్తి తయారవుతోంది. అనంతరం ఈ ప్రొడక్ట్ అమెరికాకు ఎగుమతి అవుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంతో ఉక్కు ఎగుమతులు ఆగిపోయే ప్రమాదం ఉంది. అలాగే చాలామంది ఉద్యోగాలు కోల్పేయే ప్రమాదం ఉంది.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. సుంకాల పెంపు కారణంగా భారతీయ ఉక్కు ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారని ఫిబ్రవరి 10న విడుదల చేసిన నోట్‌లో మూడీస్ రేటింగ్స్ హెచ్చరించింది.తాజాగా ట్రంప్ తీసుకున్న 50% సుంకం నిర్ణయం ప్రధాన ఎగుమతి రంగానికి తీవ్రమైన ముప్పుగా మారవచ్చని ఇంజనీరింగ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (EEPC) కూడా హెచ్చరించింది. అమెరికా ప్రతిపాదిత పెంపు దాదాపు $5 బిలియన్ల విలువైన ఇంజనీరింగ్ ఎగుమతులను దెబ్బతీస్తుందని EEPC చైర్మన్ పంకజ్ చద్దా కూడా హెచ్చరించారు.
2024లో అమెరికాకు ఉక్కు ఎగుమతి చేసిన దేశాల్లో కెనడా అగ్రస్థానంలో ఉంది. ఈ దేశం దాదాపు $7.7 బిలియన్ విలువైన ఉక్కును ఎగుమతి చేసింది. దాని తర్వాత బ్రెజిల్ ($5 బిలియన్), మెక్సికో ($3.3 బిలియన్) దేశాలు ఉన్నాయి. మరో వైపు చైనా.. అమెరికా నుండి చేసుకున్న ఉక్కు దిగుమతులు $550 మిలియన్లు ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే.. $450 మిలియన్లు విలువైన ఉక్కును దిగుమతి చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ వాటా తక్కువైనప్పటికీ ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ గట్టిగానే పడనుంది.
ఎగుమతిదారులు ఇప్పటికే నష్టాలు బేరీజు వేసుకోగా.. సాధారణ వినియోగదారులపై దాని ప్రభావం గట్టిగానే ఉండబోతోంది. త్వరలో కార్ల నుండి రిఫ్రిజిరేటర్ల వరకు ఉత్పత్తులకు అధిక ఇన్‌పుట్ ఖర్చులు కొనుగోలుదారులకు బదిలీ చేయనున్నట్లుగా భావిస్తున్నారు.అమెరికాకు చేరుకోలేని చౌకైన ఉక్కు భారత మార్కెట్‌ను ముంచెత్తితే..అది దేశీయ ఉత్పత్తిదారుల ధరల శక్తిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. తద్వారా రెండు కీలక రంగాలైన నిర్మాణం, తయారీ రంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కునే అవకాశం ఉంది.
ఇప్పటికే సుంకాలు, సరఫరా గొలుసు మార్పులతో సతమతమవుతున్న ఆటోమోటివ్ రంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశం అయితే ఉంది. సగటు వాహనం బరువులో ఉక్కు సగానికి పైగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సుంకాలు కార్ల ధరలను $2,000 నుండి $4,000 వరకు పెంచే అవకాశం ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక ట్రంప్ 2018లో తీసుకున్న సుంకాల నిర్ణయం ఉక్కు ఉత్పత్తిలో దాదాపు 1,000 ఉద్యోగాలను సృష్టించగా... తయారీ రంగంలో 75,000 ఉద్యోగాలు హాంఫట్ అయ్యాయి. మళ్లీ ఈ సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications