బంగారం ధరలతో సామాన్యులు బేజారు.. నేడు తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలిలా!!
విపరీతంగా పెరిగి 62000 రూపాయల వరకు విక్రయించబడుతున్న బంగారం ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్లలో ఏ చిన్న శుభకార్యం జరిగినా కొద్ది మొత్తంలోనైనా బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీ. అయితే పెరుగుతున్న బంగారం ధరలతో అందరూ ఆ ఆనవాయితీకి స్వస్తి చెబుతున్న పరిస్థితి ఉంది.
అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలలో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వారం పాటు బంగారం ధరలు స్థిరంగా కొనసాగిన దాఖలాలు ఈ సంవత్సరం ప్రారంభం నుండి కనిపించలేదు. ఇక తాజాగా దేశీయంగా బంగారం ధర విషయానికి వస్తే నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22క్యారెట్ల 10గ్రాముల బంగారానికి 56, 650 రూపాయలు, 10గ్రాముల 24క్యారెట్ల బంగారానికి 61,800 రూపాయల ధరలు నేడు ట్రేడవుతున్నాయి.

నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో 56, 650 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ లో 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 61, 800 రూపాయల వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,800 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61, 950 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, రాజమండ్రి, కాకినాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,650 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 800 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,650 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 800 రూపాయలు గా ప్రస్తుతం కొనసాగుతుంది.బంగారం ధరలలో పెరుగుదల ముందు ముందు ఎక్కువగానే కనిపించే అవకాశం ఉందని బంగారం ధరలు 70వేలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications