Cow Urine: గో మూత్రం లీటర్కు రూ.10.. ఎక్కడంటే..
గో మూత్రానికి సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోశాలల ఆర్థిక స్వావలంబన, ఆయుర్వేద రంగ ప్రోత్సాహం లక్ష్యంగా గోమూత్ర సేకరణ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆ రాష్ట్రేలో ఎంపిక చేసిన ప్రభుత్వ, స్వచ్ఛంద గోశాలల నుంచి గోమూత్రాన్ని కొనుగోలు చేయనుంది. గో మూత్రం సేకరణ అనంతరం దాన్ని ప్రాసెసింగ్ ద్వారా ఆయుర్వేద ఔషధాలు, ప్రాకృతిక ఎరువులు, క్రిమిసంహారకాల తయారీకి ఉపయోగించాలని యూపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలిపింది. గోవుల సంరక్షణ భారాన్ని తగ్గించి గోశాలలను స్వయంసమృద్ధి కేంద్రాలుగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని ఉత్తర ప్రదేశ్ అధికార వర్గాలు తెలిపాయి.
రైతులు, పశుపోషకుల నుంచి లీటర్ గోమూత్రాన్ని రూ.10 చొప్పున కొనుగోలు చేయనున్నారు. భవిష్యత్తులో గో మూత్రం ధరను లీటరుకు రూ.20కి పెంచే ప్రతిపాదన కూడా ఉన్నట్లు అధికారి వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం నిర్ణయంపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ విమర్శించింది. రాష్ట్రంలో నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, గ్రామాల్లో పంటలను నాశనం చేస్తున్న వీధి పశువుల తీవ్ర సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి పథకాలను తెరపైకి తెస్తోందని విమర్శించింది.

మౌలిక వసతులు, ఉపాధి వంటి కీలక అంశాలను పక్కనపెట్టి గోమూత్ర సేకరణపై దృష్టి సారించడం పాలనా ప్రాధాన్యతల లోపానికి నిదర్శనమని సమాజ్వాది పార్టీ ఆరోపించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గో ఆధారిత ఉత్పత్తులను (పంచగవ్య) వాణిజ్యపరంగా ప్రోత్సహించడం ఒక వైపు సాంప్రదాయ విధానమే అయినా, దాని అమలు తీరుపై అనేక సవాళ్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
సేకరించిన గోమూత్రానికి నాణ్యతా ప్రమాణాలు పాటించడం, శాస్త్రీయ శుద్ధి, సక్రమమైన మార్కెటింగ్ నెట్‌వర్క్ ఏర్పరచడం ప్రాజెక్ట్ విజయానికి అత్యంత కీలకం కానుందని చెబుతున్నారు. గో మూత్రం వల్ల నింజగానే లాభాలు వస్తే మిగతా రాష్ట్రాల వారు గో మూత్రం అమ్మడానికి సిద్దమయ్యే అవకాశం ఉంది. ఆవు పాలతో పాటు గోమూత్రంతో పాడి రైతులకు లాభం చేకూరే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications