Layoffs: ఇంట్లో రివర్స్ రోల్స్.. సంపాదించే పిల్లలు.. ఆధారపడే తల్లిదండ్రులు! భారత్‌లో కొత్త ట్రెండ్!

భారతీయ కార్పొరేట్ రంగంలో ప్రస్తుతం ఒక వింతైన, ఆందోళనకరమైన మార్పు కనిపిస్తోంది. 50 ఏళ్ల వయసులో ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్ లేఆఫ్స్ (layoffs) బారిన పడుతుంటే.. వారి స్థానంలో అప్పుడే కెరీర్ మొదలుపెట్టిన వారి పిల్లలు ఇంటి ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. నిన్నటి వరకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి, నేడు తన మొదటి ఉద్యోగం సంపాదించిన బిడ్డపై ఆధారపడటం అనే ఈ పరిస్థితిని నిపుణులు "శాండ్‌విచ్ జనరేషన్ లేఆఫ్" అని పిలుస్తున్నారు.

The sandwich generation layoff when parents lose jobs and children become the family financial anchor in India

గురుగ్రామ్ నుండి ఒక నిజ జీవిత ఉదాహరణ

గురుగ్రామ్‌కు చెందిన 52 ఏళ్ల సోను కథే దీనికి నిదర్శనం. ఒక ప్రముఖ టెక్ సంస్థలో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా 25 ఏళ్ల పాటు పనిచేసిన ఆయన, ఇప్పుడు తన ఉదయాన్ని లింక్డ్‌ఇన్ (LinkedIn) లో ఉద్యోగ వేటతో గడుపుతున్నారు. ఇన్నేళ్లు ఆయనే ఇంటికి ఆధారం. కానీ ఇప్పుడు ఇంటి అద్దె, ఈఎంఐలు, కనీసం ఆయన ఉదయం తాగే టీ ఖర్చు కూడా ఆయన 22 ఏళ్ల కూతురు అనన్య భరిస్తోంది. ఆమె ఇటీవలే ఒక ఫిన్‌టెక్ స్టార్టప్‌లో యూఐ/యూఎక్స్ డిజైనర్‌గా చేరింది. ఇది కేవలం ఒక్క సోను కథ మాత్రమే కాదు, నేడు భారతీయ ఐటీ , ఇతర రంగాల్లో వేల కుటుంబాల పరిస్థితి ఇదే.

మధ్య వయసులో ఉద్యోగ సంక్షోభం

భారతీయ జాబ్ మార్కెట్‌లో ప్రస్తుతం ఒక విరుద్ధమైన ధోరణి ఉంది. కంపెనీలు కొత్త టెక్నాలజీ తెలిసిన ఫ్రెషర్లను తీసుకుంటున్నాయి, కానీ ఎక్కువ జీతాలు తీసుకునే 45-55 ఏళ్ల మధ్య ఉన్న మిడిల్ మేనేజ్‌మెంట్ నిపుణులను లేఆఫ్స్ (layoffs) పేరుతో తొలగిస్తున్నాయి.

  • Foundit నివేదిక ప్రకారం, మిడిల్ , సీనియర్ లెవల్ ఉద్యోగాల్లో నియామకాలు 12-15 శాతం తగ్గాయి.
  • NASSCOM-Zinnov నివేదిక ప్రకారం, ఏఐ (AI) ప్రభావం వల్ల 2026 నాటికి దాదాపు 30 శాతం మిడిల్ లెవల్ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉంది.
  • ఈ వయసు వారు ఒకవైపు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, మరోవైపు చదువుకుంటున్న పిల్లలను చూసుకోవాల్సిన "శాండ్‌విచ్" స్థితిలో ఉంటారు. ఈ సమయంలో పింక్ స్లిప్ అందడం వారిని ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా కుంగదీస్తుంది.

పిల్లలపై పడుతున్న ఆర్థిక భారం

డెలాయిట్ 2024 సర్వే ప్రకారం, భారతదేశంలోని 52 శాతం మంది Gen Z యువత కేవలం నెల జీతంపైనే ఆధారపడి బతుకుతున్నారు (Paycheck to paycheck). ఇంటి బాధ్యతలు పెరగడం వారి కెరీర్ ప్రారంభంలోనే తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. ఒక సీనియర్ ప్రొఫెషనల్ నెలకు రూ. 1.5 లక్షల నుండి రూ. 2.5 లక్షల వరకు సంపాదిస్తే, ఒక ఫ్రెషర్ జీతం సగటున రూ. 50,000 మాత్రమే ఉంటుంది. ఈ తక్కువ మొత్తంతో ఇల్లు గడపడం వల్ల ఆ యువతీ యువకులు తమ భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోలేక "జీరో-సేవింగ్స్ ట్రాప్" (Zero-savings trap) లో చిక్కుకుపోతున్నారు.

ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?

కెరీర్ కోచ్ కిరణ్ భాటియా ప్రకారం, ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల మధ్య పారదర్శకత చాలా ముఖ్యం. "ఫ్యామిలీ బోర్డ్ మీటింగ్" పెట్టుకుని, అందరూ కూర్చుని ఆర్థిక పరిస్థితిని చర్చించుకోవాలి. తల్లిదండ్రులు దీనిని రిటైర్మెంట్‌గా భావించకుండా, కన్సల్టింగ్ లేదా ఫ్రీలాన్సింగ్ వైపు మళ్లడానికి ఒక అవకాశంగా చూడాలి. అలాగే, పిల్లలు తమ విజయాల పట్ల అపరాధ భావం (Guilt) పెంచుకోకూడదు.

ఏదేమైనా ఈ కష్టకాలంలో ఒక సానుకూల అంశం కూడా ఉంది. కుటుంబంలో పాత తరహా ఆధిపత్యం తగ్గి, ఒకరికొకరు తోడుగా నిలిచే ధోరణి పెరుగుతోంది. తండ్రికి డిజిటల్ స్కిల్స్ కూతురు నేర్పిస్తుంటే, కూతురికి బాధ్యతలను తండ్రి నేర్పిస్తున్నారు. ఆర్థికంగా ఇది సవాలు అయినప్పటికీ, భారతీయ కుటుంబ వ్యవస్థ ఒక బలమైన 'సేఫ్టీ నెట్' గా తనను తాను నిరూపించుకుంటోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+