భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. కొనాలంటే ఇదే సమయం.. నేడు ధరలిలా!!
బంగారం.. భారతదేశంలోని ప్రజలకు బంగారం అంటే ఒక ఎమోషనల్ కనెక్ట్. ఏ చిన్న సందర్భం అయినా, వివాహాది వేడుకలు అయినా, ఒకరిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి అయినా బంగారు ఆభరణాలను గిఫ్టుగా ఇవ్వడం వారిలో ఉన్నటువంటి ఎమోషన్ ను స్పష్టం చేస్తుంది. అంతగా భారతీయులతో పెనవేసుకున్న బంగారం ధరలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరగడం పసిడి ప్రియులను కాస్త నిరాశకు గురి చేసింది.
అయితే ఈ నెలలో బంగారం ధర దాదాపు 1800రూపాయల మేర తగ్గడం పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఇక బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పతనమై ఈ నెలలో 6,700 రూపాయల మేర తగ్గాయి. ఈ నెల ప్రారంభం నుండి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు పసిడి ధర 1800 రూపాయలు తగ్గింది. ఇది బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి తీపికబురని చెప్పాలి.

అంతర్జాతీయంగా బంగారం ధరలు దిగి రావడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్ పై కూడా పడింది. దీంతో బంగారం ధరలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక తాజాగా బంగారం ధర విషయానికి వస్తే హైదరాబాదులో బంగారం ధరలు నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 55,550 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 60, 600 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 55, 700 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 750 రూపాయలు వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాములు బంగారం ధర 55,550 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 60, 600 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం, కాకినాడ, రాజమండ్రి లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,550 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 600 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
అయితే బంగారం కొనుగోలు చెయ్యాలి అనుకునేవారు ఇప్పుడు కూడా కొనుగోలు చేసుకోవచ్చని, భవిష్యత్ లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నాయని అంటున్నారు. భవిష్యత్ లో బంగారం ధర 70 వేల రూపాయలకు చేరుతుందని చెప్తున్నారు. కాబట్టి బంగారం ప్రియులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications