ఆధార్తో పాన్‌ను లింక్ చేయడానికి గడువు నిన్నటితో ముగిసింది. ఐటీ వెబ్ సైట్ లో అధిక రద్దీ కారణంగా, చెల్లింపు చలాన్‌ను డౌన్ లోడ్ చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. పాన్ కార్డ్ హోల్డర్లకు ఉపశమనం కలిగించేందుకు ఆదాయపు పన్ను శాఖ గడువును పొడిగిస్తుందని భావించారు. కానీ ఆదాయపు పన్ను శాఖ ఆ పని చేయలేదు.గడువును పొడిగించనప్పటికీ, బాధిత వినియోగదారులకు సహాయం చేయడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంది.
"పాన్ హోల్డర్లు శ్రద్ధ వహించండి! ఆధార్-పాన్ లింకింగ్ కోసం రుసుము చెల్లించిన తర్వాత చలాన్ డౌన్‌లోడ్ చేయడంలో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తించాము. పేమెంట్ అయిందో లేదో చలాన్ చెల్లింపు స్థితిలో తనిఖీ చేయవచ్చు. లాగిన్ అయిన తర్వాత పోర్టల్ ఇ-పే ట్యాక్స్ ట్యాబ్. చెల్లింపు విజయవంతమైతే, పాన్ హోల్డర్ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి కొనసాగవచ్చు" అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చలాన్ రసీదును డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని I-T విభాగం తెలిపింది. "ఇంకా, పాన్ హోల్డర్ విజయవంతంగా చెల్లింపును పూర్తి చేసిన వెంటనే, చలాన్ అటాచ్ చేసిన కాపీతో కూడిన ఇమెయిల్ ఇప్పటికే పాన్ హోల్డర్‌కు పంపిస్తామని పేర్కొంది. మీకు మరింత సహాయం కావాలంటే, దయచేసి [email protected]లో మీ వివరాలను (పాన్ & మీ మొబైల్ నంబర్‌తో పాటు) మాతో పంచుకోండి, తద్వారా మా బృందం మిమ్మల్ని సంప్రదించగలదు" అని డిపార్ట్‌మెంట్ తెలిపింది.
ఇప్పటికీ కూడా ఆధార్ పాన్ లింక్ చేయని వారు పాన్ కార్డు పని చేస్తుందా లేదా అనే దానిపై ఆదాయపు పన్ను శాఖ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే.. ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ లో ఆధార్ పన్ లింక్ ఆప్షన్ అయితే చూపిస్తోంది. ఆధార్ తో పాన్ లింక్ చేయకుంటే ఆ పాన్ ఇనవ్యాలిడ్ అవుతుందని చెబుతున్నారు. అయితే దీనిపై ఆదాయపు పన్ను శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు.


Click it and Unblock the Notifications