అమెరికాలో H1B వర్క్ వీసాపై ఉన్న వారిలో 2,00,000 మంది జూన్ చివరి నాటికి చట్టబద్దత కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో చైనా, భారత్‌కు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. ఉద్యోగాలు పోయి కొందరు, వేతనం లేని సెలవుల్లో కొందరు, ప్రస్తుతానికి ఉద్యోగం ఉన్నా ఎప్పుడేం జరుగుతుందో తెలియని గందరగోళంలో మరికొందరు ఉన్నారు. జూన్ చివరి నాటికి రెండు లక్షలమంది H1B వీసా చట్టబద్ధత కోల్పోయే ప్రమాదం ఉందని ఓ నివేదిక వెల్లడించింది.

రంగంలోకి దిగిన దిగ్గజ కంపెనీల గ్రూప్
ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో దిగ్గజ కంపెనీలు ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, అమెజాన్ వంటి సంస్థలు సభ్యులుగా ఉన్న టెక్‌నెట్ అనే లాబీయింగ్ గ్రూప్ ఏప్రిల్ 17వ తేదీన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి ఓ లేఖ రాసింది. యూఎస్‌లో ఉన్న విదేశీ ఉద్యోగులకు ఉపశమనం కోరింది. ఈ గడువును కనీసం సెప్టెంబర్ 10వ తేదీ వరకు పొడిగించాలని కోరింది. ఉద్యోగం కోల్పోయాక 60 రోజులు మాత్రమే దేశంలో ఉండాలనే నిబంధనని సవరించాలని కోరింది. ఈ మేరకు సంతకాల సేకరణ చేపడుతోంది.

ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం
ఈ అంశాన్ని పరిశీలించకుంటే వేలాది ఉద్యోగాలు ఫుల్‌ఫిల్ కాకుండా ఉండిపోతాయని, అప్పుడు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది టెక్‌నెట్. టెలిహెల్త్ కేర్ సర్వీస్‌లో వైద్యులకు సహకరించడం, విద్యార్థులు ఇంట్లో నేర్చుకోవడం సహా ఎన్నో పరిశ్రమకు అవసరమని టెక్‌నెట్‌లోని ఫెడరల్ పాలసీ, గవర్నమెంట్ రిలేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ బుర్గోస్ అన్నారు. ఇప్పటికే ట్యాక్స్ ఫైలింగ్ గడువును పెంచారని, వీసా పొడిగింపు కూడా అవసరమే అన్నారు. మరోవైపు ఉద్యోగం కోల్పోయాక 60 రోజులు మాత్రమే దేశంలో ఉండాలనే నిబంధనను సవరించి 180 రోజులకు పెంచాలని H1B వీసాదారులు కోరుతున్నారు.

అండగా ఉంటాం
వీసా గడువు పెంపుపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్పందించాల్సి ఉంది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికార ప్రతినిధి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తప్పకుండా అండగా ఉంటామన్నారు. ట్రంప్ ప్రభుత్వం ఫారన్ బర్న్ వర్కర్స్ పైన కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో 2015లో 10.9 మిలియన్లుగా ఉన్న నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల సంఖ్య వరుసగా నాలుగో ఏడాది తగ్గి 2019లో 8.7 మిలియన్లకు చేరుకుంది.

ట్రంప్ నిర్ణయం.. కంపెనీలకు ఇబ్బందికరం
అమెరికన్లకు ఉద్యోగ రక్షణ ఉండేందుకు ట్రంప్ ప్రభుత్వం అన్ని ఇమ్మిగ్రేషన్లపై తాత్కాలిక నిషేధం విధించాలని ట్రంప్ ఏప్రిల్ 20న ట్వీట్ చేశారు. మరుసటి రోజు గ్రీన్ కార్డు నిబంధనను 60 రోజులు పొందకుండా ఉండేలా ఉత్తర్వులు జారీ ఇచ్చారు. ఇది విదేశీయులను ఉద్యోగులుగా నియమించుకున్న చాలా కంపెనీలకు ఇబ్బందికరంగా మారింది.


Click it and Unblock the Notifications