దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) రానున్న అయిదేళ్ళలో తమ ఉద్యోగులు కార్యాలయంలో గడిపే సమయాన్ని తగ్గించే యోచనలో ఉంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఐటీ కంపెనీలు సహా వివిధ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. దీంతో కొన్ని రంగాల్లో ప్రోడక్టివిటీ అంతముందు కంటే బాగుంది. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే పరిస్థితిని కొన్ని కంపెనీలు పరిశీలిస్తున్నాయి.

25 శాతం వర్క్ ఫోర్స్ ఉంటే చాలు
రిమోట్ వర్కింగ్ మోడల్‌ను కరోనా తర్వాత కూడా అప్లై చేసే అంశాన్ని టీసీఎస్ పరిశీలిస్తోంది. 4వ క్వార్టర్ ఫలితాల సందర్భంగా టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణియన్ మాట్లాడుతూ.. 100 శాతం ఉత్పత్తి కోసం కార్యాలయాల వద్ద 25 శాతం వర్క్ ఫోర్స్ ఉంటే చాలునని అభిప్రాయపడ్డారు.

కరోనా ఎఫెక్ట్‌తో మార్పు
ప్రతి ఉద్యోగి ఆఫీస్‌కు హాజరు కావాల్సిన అవసరం లేదని, వారు తమ సమయాన్ని కార్యాలయంలో 25 శాతం సమయం కేటాయిస్తే చాలునని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు పరిమిత రోజులు లేదా అత్యవసరమైతే మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేవి. కానీ కరోనా కారణంగా ఇప్పుడు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. ప్రోడక్టివిటీ తగ్గకపోవడంతో వివిధ కంపెనీల్లో మార్పు వచ్చింది.

ఏ మోడల్ అయినా.. 100 శాతం అవసరం లేదు
కరోనా కారణంగా మార్చి నెల నుండి 80 శాతం మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ప్రారంభించారని, ఇంటి నుండి పని చేస్తూనే ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లకు సేవలు అందిస్తున్నారని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ అన్నారు. ముంబై హెడ్ క్వార్టర్ 2025 కొత్త మోడల్‌కు మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కార్యాలయంలో 25 శాతమా, 50 శాతమా అని కాదని, మొత్తానికి 100 శాతం కార్యాలయంలో అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

టీసీఎస్ దారిలో విప్రో..
మొత్తానికి టీసీఎస్ కంపెనీ 2025 నాటికి కార్యాలయం నుండి పనిచేసే వర్క్ ఫోర్స్‌ను 25 శాతానికి కుదించే అవకాశాలు ఉన్నాయి. మరో ఐటీ దిగ్గజం విప్రో కూడా అదే దారిలో నడిచే అవకాశముంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఐటీ సెక్టార్‌లో 90 శాతం ఇంటి నుండి పని చేస్తున్నారు.

క్లయింట్ పర్మిషన్ అవసరం
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఐటీ కంపెనీలు మొగ్గు చూపినప్పటికీ క్లయింట్స్ అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత కూడా కావాలంటే క్లయింట్స్ అనుమతి అవసరం.

విప్రో ఆలోచన
విప్రో ఉద్యోగుల్లో 93 శాతం మేది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వ్యాపార కంటిన్యుటీ ప్లాన్‌లో భాగంగా రిమోట్ సేవలు అందిస్తున్నారు. అయితే దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులు అందరు కూడా తిరిగి తమ క్యాంపస్‌లకు రావడం అవసరమా అనే ఆలోచన చేస్తోందట. అంటే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేసే ఆలోచన చేస్తుందని భావించవచ్చు. కొంతమంది ఉద్యోగులను పర్మినెంట్‌గా ఇంటి నుండే పని చేయించాలా అనే చర్చ సాగుతోందని విప్రో చీఫ్ హెచ్ఆఱ్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ అన్నారు. అయితే ఈ మార్పు కోసం క్లయింట్స్ అనుమతి అవసరమన్నారు.

ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ సెంటర్స్
బ్రిటిష్ ఎయిర్వేస్, జనరల్ ఎలక్ట్రిక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి ఖాతాదారుల కోసం ఇండియన్ ఐటీ కంపెనీలు తమ క్యాంపస్‌లలోనే రెండు దశాబ్దాలుగా ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ సెంటర్స్ (ODCs) లేదా యూనిట్స్ కాన్సెప్ట్‌ను ఇంట్రొడ్యూస్ చేశాయి. ఈ కేంద్రాల్లో సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. కేవలం అనుమతి ఉన్న ఉద్యోగులు మాత్రమే సెన్సిటివ్ కస్టమర్ డేటా యాక్సెస్‌ను పొందగలరు.

హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ODCs
బెంగళూరు, పుణే, హైదరాబాద్, నోయిడా, చెన్నై తదితర నగరాల్లో ఐటీ కంపెనీలకు తమ ఖాతాదారుల కోసంఏర్పాటు చేసిన ODCలు ఉన్నాయి. వివిధ కేంద్రాల్లో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఐటీ కంపెనీల ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రస్తుతం కార్యాలయాల కోసం లక్షలు వెచ్చిస్తున్నాయి. ఈ మొత్తం తగ్గుతుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications