రైతుల జీవితాలను పణంగా పెట్టలేం, అమెరికాకు తేల్చి చెప్పిన మోదీ సర్కారు.. వాణిజ్య ఒప్పందంపై వీడని సస్పెన్స్

భారత్- అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఓ కొలిక్కి రావడంలేదు. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కొన్ని డిమాండ్లను భారతదేశం ముందు పెట్టింది. అయితే ఆ డిమాండ్లను కేంద్రంలోని మోదీ సర్కారు అంగీకరించలేదు. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన చర్చలు ఆగిపోయాయి. కాగా మొక్కజొన్న, సోయాబీన్ వంటి దిగుమతులపై సుంకాలను తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు కోరుతోంది.అయితే ఈ నిర్ణయం భారత రైతులకు, వినియోగదారులకు నష్టం కలిగిస్తుందని భారత ప్రభుత్వం భావిస్తోంది.అందుకని ఈ డిమాండ్లను భారత్ వ్యతిరేకిస్తోంది..

రైతుల ఆశలను పణంగా పెట్టలేం : ఇక అమెరికా నుండి వచ్చే జన్యుపరంగా మార్పు చేసిన ఆహార పదార్థాల (GM foods)పై ఆరోగ్యపరమైన ఆందోళనలు కూడా భారత్ పరిశీలిస్తోంది. ఈ అంశం కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి అడ్డంకిగా మారింది. దేశంలోని 140 కోట్ల మంది వినియోగదారులు, రైతుల ఆశలను పణంగా పెట్టలేమని భారత్ ఖరాఖండిగా చెప్పేసింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించిన 100% బేస్‌లైన్ టారిఫ్ పై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.ఇది అన్ని దేశాలకు ఒకే విధంగా వర్తిస్తుంది కనుక, భారత్‌కు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం కలిగే అవకాశం లేదని మోదీ సర్కారు భావిస్తోంది.

India US trade deal agricultural imports tariff dispute low-duty farm products India US relations trade negotiations genetically modified food farm subsidies Indian farmers trade policy import duties US India trade tensions bilateral trade talks protectionism US agri exports

ఇదే విషయమై లండన్ లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఒప్పందం కుదిరే సమయంలో అది రెండు పక్షాలకు లాభదాయకంగా ఉండాలి. న్యాయంగా, సమతౌల్యంగా ఉండాలని తెలిపారు. ఈ పరిస్థితుల ఇలా ఉంటే ఈ వాణిజ్య ఒప్పంద భవితవ్యంపై ఇప్పటికీ స్పష్టత లేకపోయినా, వచ్చే రోజుల్లో నిర్ణయాత్మక మలుపులు ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.

భారతదేశానికి భారంగా మారే అవకాశం : ఇక జూలై 9 నాటికి ఒప్పందం కుదరకపోతే, ట్రంప్ సర్కారు అమలు చేయనున్న 26% ప్రతిస్పందన పన్ను (reciprocal tariff) భారతదేశానికి భారంగా మారే అవకాశం ఉంది. ఈ నిర్ణయం భారత పరిశ్రమలు అమెరికాలో 26% వరకు దిగుమతి సుంకాలు చెల్లించాల్సిన పరిస్థితిని తీసుకురావొచ్చు. వాణిజ్య చర్యల్లో భాగంగా మోదీ సర్కారు వస్త్రాలు, తోలుబట్టలు, ఔషధాలు, ఆటో విడిభాగాలు, ఇంజనీరింగ్ వస్తువులపై పూర్తిగా సుంకాలను ఎత్తివేయాలని అమెరికాను కోరుతోంది. అయితే దీనికి అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాము పన్ను లేకుండా పనిచేయలేమని సున్నా సుంకం విధానం సాధ్యం కాదని చెబుతోంది.

భారత ప్రభుత్వం గట్టిగానే కండీషన్: అమెరికాతో ఒప్పందం కుదిరిన తర్వాత అగ్రరాజ్యం భవిష్యత్‌లో ఎటువంటి కొత్త సుంకాలు విధించకూడదని భారత ప్రభుత్వం గట్టిగానే కండీషన్ పెడుతోంది. అయితే ఈ అంశంపై ఇప్పటికీ అమెరికా నుంచి స్పష్టత రాలేదు. ఈ సందర్భంలో అమెరికాతో వాణిజ్యపరమై చర్చల్లో పురోగతి ఇప్పట్లో కనిపించే ఛాయలు కనపడటం లేదు. కాని అమెరికా మాత్రం త్వరగా చర్చలు ముగియాలని కోరుకుంటోంది.

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాయాది దేశంతో భారత్ తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ తానే ఆపేశానని స్టేట్ మెంట్ ఇవ్వడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోదీ మీరు అలా ఎలా స్టేట్ మెంట్ ఇస్తారంటూ తీవ్రంగా ఖండించారు. దీంతో వాణిజ్య సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ఇది అడ్డు అవుతోందని భారత వర్గాలు పేర్కొంటున్నాయి.

దేశంలోని రైతులపై ప్రభావం :అమెరికా తమ దేశంలో ఉత్పత్తి అయిన మొక్కజొన్న, సోయాబీన్ వంటి జన్యుపరంగా మార్పులు చేసిన పంటలను భారత్ మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. దేశంలోని రైతులపై దీని ప్రభావం పడుతుందని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా పంటల ఉత్పత్తులు భారత మార్కెట్‌ను ముంచివేస్తే దేశీయ రైతుల జీవనోపాధికి పెద్ద దెబ్బ తగులుతుందని ఖరాఖండిగా చెబుతోంది.

అందువల్ల రైతులకే మా తొలి ప్రాధాన్యం ఇస్తామని మోదీ సర్కారు స్పష్టం చేస్తోంది. భారత నిబంధనల ప్రకారం ఇవి జన్యుమార్పిడి లేదని (నో GM) సర్టిఫికేట్ లేకుండా దేశంలోకి అనుమతించబడవు. అయతే అమెరికా మాత్రం ఈ ఉత్పత్తులకు ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేదు. జూలై 9న రెండు దేశాలు మరోమారు సమావేశం కానున్నాయి. అప్పుడున్నా చర్చలు ఓ కొలిక్కి వస్తాయేమో చూడాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+