For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stock Market: భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న ఐటీ స్టాక్స్

|

గురువారం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికాలో అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం తగ్గుదల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు పెరిగాయి. ఉదయం 9 గంటల 33 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 1054 పాయింట్లు పెరిగి 61,688 వద్ద ట్రేడవుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 297 పాయింట్ల లాభంతో 18,319 వద్ద కొనసాగుతోంది.

బ్యాంక్ నిఫ్టీ
స్టాక్ మార్కెట్‌లో అద్భుత పెరుగుదల కారణంగా బ్యాంక్ నిఫ్టీ తొలిసారిగా 42000 దాటింది. మార్కెట్‌లో నేటి బూమ్‌లో, అన్ని రంగాల షేర్లు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఇంధనం, ఆటో రంగాల షేర్లలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా చురుకైన వేగంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టీలోని 50 షేర్లలో ఒక షేర్ మాత్రమే రెడ్ మార్క్‌లో ట్రేడవుతుండగా, 49 షేర్లు గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 29 స్టాక్‌లు లాభాలతో ట్రేడవుతుండగా, ఒక షేరు క్షీణిస్తోంది.

 Stock markets started with huge gains on Friday

ఇన్ఫోసిస్
US లో అక్టోబర్ నెల ద్రవ్యోల్బణం గణాంకాలలో క్షీణత ఉంది. ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 8.2 శాతం నుంచి 7.7 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం తగ్గిన తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్‌లో భారీ పెరుగుదల కనిపించింది. నాస్‌డాక్ 7.35 శాతం అంటే 760 పాయింట్ల జంప్‌తో 11,114 పాయింట్ల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ 4.05 శాతం, హెచ్ సీఎల్ టెక్ 4.16, టెక్ మహీంద్రా 3.86 శాతం, విప్రో 3.75 శాతం, టిసిఎస్ 3.52 శాతం టాటా స్టీల్ 2.53, బజాజ్ ఫైనాన్స్ 2.35 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.

English summary

Stock Market: భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న ఐటీ స్టాక్స్ | Stock markets started with huge gains on Friday

Stock markets started with huge gains on Friday. IT shares are continuing to gain as inflation in the US continues to decline.
Story first published: Friday, November 11, 2022, 9:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X