For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పతనమైన రూపాయి..

|

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. 30 షేర్ల బిఎస్‌ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 62,410.68 వద్ద ముగిసింది ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 ఇండెక్స్ 82.25 పాయింట్లు క్షీణించి 18,560 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత కాస్త లాభాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత ఆర్బీఐ వరుసగా ఐదవసారి రెపో రేట్లను పెంచడంతో రెండు ఇండెక్స్‌లు పడిపోయాయి.

రూపాయి

రూపాయి

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మళ్లీ బలహీనపడింది. ఇంట్రాడే ట్రేడ్‌లో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ బెంచ్‌మార్క్‌లు పురోగమించడంతో రూపాయి మంగళవారం నాడు డాలర్‌తో పోలిస్తే 82 మార్క్ దిగువన 82.46కి పడిపోయింది. కమోడిటీస్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.6 శాతం పడిపోయి $78.86కి పడిపోయింది.

ఏసియన్ పేయింట్స్

ఏసియన్ పేయింట్స్

బీఎస్ఈ 30 స్టాక్ ల్లో ఏసియన్ పేయింట్స్, హిందూస్థాన్ యూనిలివర్, ఎల్&టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఎం&ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా లాభాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్ టెల్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐఎన్, డా రెడ్డీస్, ఇన్ఫోసిస్, మారుతీ, టైటాన్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫినాన్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, హెచ్సీఎల్ టెక్, సన్ ఫార్మా, రిలయన్స్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ నష్టాల్లో స్థిరపడ్డాయి.

బ్యాంక్ నిఫ్టీ

బ్యాంక్ నిఫ్టీ

బ్యాంక్ నిఫ్టీ 0.09 శాతం నష్టపోయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.42 శాతం నష్టపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.42 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్ నష్టపోగా.. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ స్వల్ప లాభాల్లో ముగిసింది.

English summary

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పతనమైన రూపాయి.. | Stock markets ended in losses on Wednesday

Stock markets closed lower on Wednesday. The 30-share BSE Sensex index lost 215 points to close at 62,410.68 while the NSE Nifty-50 index shed 82.25 points to settle at 18,560.
Story first published: Wednesday, December 7, 2022, 16:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X