For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఆటో, ఐటీ, ఫార్మా స్టాక్‍ల్లో ఒత్తిడి..

|

శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 10:18 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 227 నష్టపోయి 59,730 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 57 పాయింట్లు కోల్పోయి 17,808 వద్ద ట్రేడవుతుంది.డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.40 వద్ద కొనసాగుతోంది. డిసెంబరులో అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడంతో అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి.

ఆటో, ఐటీ

ఆటో, ఐటీ

అయినా భారత స్టాక్ మార్కెట్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రైవేట్ బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ, ఇన్‌ఫ్రా రంగాల షేర్లలో క్షీణత కనిపించగా, మెటల్స్, రియల్ ఎస్టేట్, మీడియా రంగాల షేర్లలో పెరుగుదల ఉంది. బీఎస్ఈ 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 13 స్టాక్స్ లాభాల్లో ఉండగా.. 17 క్షీణతతో ట్రేడవుతున్నాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 28 స్టాక్స్ లాభాల్లో ఉండగా 22 స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

లాభాల్లో ఉన్న స్టాక్స్

లాభాల్లో ఉన్న స్టాక్స్

ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్ లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ , టాటా స్టీల్ , అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, ఎన్‌టిపిసి , బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బిఐ, మహీంద్రా & మహీంద్రా , మహీంద్రా & మహీంద్రా లాభాల్లో కొనసాగుతోన్నాయి.

నష్టాల్లో ఉన్న స్టాక్స్

నష్టాల్లో ఉన్న స్టాక్స్

హెచ్‌సిఎల్ టెక్, లార్సెన్,టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, విప్రో, టైటాన్, టాటా మోటర్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

English summary

Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఆటో, ఐటీ, ఫార్మా స్టాక్‍ల్లో ఒత్తిడి.. | Stock markets continue to suffer losses on Friday morning

Stock markets continued to lose on Friday. At 10:18 am, the BSE Sensex lost 227 to trade at 59,730.
Story first published: Friday, January 13, 2023, 10:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X