For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్లు ఈ వారం ఎలా ఉండవచ్చు, బంగారం ఒత్తిడిలో కొనసాగే అవకాశం

|

ముంబై: స్టాక్ మార్కెట్లు గతవారం నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ, ఆసియా మార్కెట్ ప్రతికూల ప్రభావం మన మార్కెట్లపై పడింది. కరోనా థర్డ్ వేవ్, డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల భయం మార్కెట్లను ఈ వారం కూడా కలవరపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత వారం మార్కెట్ రికార్డ్ గరిష్టానికి చేరుకోవడం కూడా నష్టాలకు కారణంగా కనిపించాయి. ఎందుకంటే ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు కూడా మొగ్గు చూపారు. ఈ వారం మార్కెట్ 52,000 పాయింట్ల దిగువకు వస్తే మరింత క్షీణించే అవకాశాలు లేకపోలేదు. రికార్డ్ గరిష్టాన్ని కూడా తాకవచ్చు.

మార్కెట్లపై వీటి ప్రభావం

మార్కెట్లపై వీటి ప్రభావం

సెన్సెక్స్ మద్దతు 52,175, 51,500. నిరోధక స్థాయి 52,875, 53,500. సెన్సెక్స్ 52వేల దిగువకు వస్తే మరింత బలహీనపడవచ్చును. అంతర్జాతీయ మార్కెట్ నుండి వచ్చే సంకేతాలకు అనుగుణంగా దేశీయ సూచీలు కదలవచ్చు. అమెరికా మార్కెట్‌కు కొన్ని సెలవులు ఉన్నాయి. దీంతో స్థిరీకరణ అవకాశముంది. అలాగే, దేశీయంగా ఐటీ, ఇతర కంపెనీల త్రైమాసిక ఫలితాల ప్రభావం మార్కెట్ పైన ఉటుంది. జూలై 8న టీసీఎస్ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా థర్డ్ వేవ్, డెల్టా వేరియంట్, ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లాక్ డౌన్, అన్ లాక్ నిర్ణయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

వివిధ రంగాలు....

వివిధ రంగాలు....

డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ వారం ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో ఉండవచ్చు. కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో డిమాండ్ మరింత పుంజుకుంటుందని భావిస్తున్నారు. సిమెంట్ రంగం ఇటీవల భారీగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో గత వారం ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఇది ఈ వారం కొనసాగవచ్చు. బ్యాంకింగ్ షేర్లు స్థిరంగా కనిపించవచ్చు. టెలికం రంగ షేర్లు కొన్ని పైకి, కొన్ని కిందకు పడిపోవచ్చు. వాహన రంగ షేర్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.

బంగారం ధరలు.

బంగారం ధరలు.

గోల్డ్ జూలై ఫ్యూచర్ ఈ వారం రూ.46,800 దిగువకు వస్తే మరింత దిద్దుబాటుకు గురి కావొచ్చు. రూ.47,050 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని కొనుగోలు చేయవచ్చు. సిల్వర్ జూలై ఫ్యూచర్ రూ.69,000 దిగువకు పడిపోతే మరింత క్షీణించి రూ.67,600 స్థాయికి చేరుకోవచ్చు. ఎంసీఎక్స్ మెటల్ డెక్స్ జూలై ఫ్యూచర్ రూ.14,820 కంటే ఎగువకు వెళ్తే మరింత దిద్దుబాటుకు గురి కావొచ్చు.

English summary

మార్కెట్లు ఈ వారం ఎలా ఉండవచ్చు, బంగారం ఒత్తిడిలో కొనసాగే అవకాశం | Stock and Bullion market this week: Gold could come under pressre

The Nifty touched a record high of 15,915 on previous week but erased gains and closed below 15800 levels.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X