కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో కంపెనీలు నష్టాల్లోకి వెళ్లి ఉద్యోగాల కోత, వేతన కోత బాటపట్టాయి. సుదీర్ఘ లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవస్థ మరో ఆరు నెలల నుండి ఏడాదికి గాని కోలుకునే పరిస్థితి లేదు. దీంతో కంపెనీలు జాబ్ కట్ లేదా శాలరీ కట్ లేదా నియామకాలు నిలిపివేయడం వంటివి చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగాలు కష్టమేననే అంచనాలు ఉన్నాయి. అయితే కొన్ని కంపెనీలు ఇదే సమయంలో హైరింగ్స్‌తో పాటు టాలెంట్ కోసం సెర్చ్ చేస్తున్నాయట.

ఖాళీలు ఉన్నాయ్!
క్యాప్‌జెమిని, గోల్డ్‌మన్ సాక్స్ సహా వివిధ కంపెనీలు ఇండియాలో అగ్రశ్రేణి ప్రతిభావంతుల కోసం సెర్చ్ చేస్తున్నాయట. టెక్, డిజిటల్, కోర్ డొమైన్ స్పెషలిస్ట్స్ కోసం చూస్తున్నాయట. ఓ డేటా ప్రకారం గత వారంలో 200 కంటే ఎక్కువ డైరెక్టర్ స్థాయి, అంతకుపైస్థాయి పోస్టులు అందుబాటులో ఉన్నాయట. గోల్డ్‌మన్ సాక్స్, వేదాంత, క్యాప్‌జెమిని వంటి సంస్థలు వారు నియామకాలు జరుపుతున్నట్లు వెల్లడించినట్లు ఓ పత్రికలో వచ్చింది.

బెస్ట్ టాలెంట్‌ను నియమించుకుంటాం
కరోనా మహమ్మారి సమయంలో తాము బెస్ట్ టాలెంట్‌ను నియమించుకుంటున్నామని గోల్డ్‌మన్ సాక్స్ ఇండియా హెడ్ ఇటీవల తెలిపారు. వేదాంత సామర్థ్యం పెంచుకోవడానికి సముచిత టెక్నికల్ హైరింగ్స్‌ను ఫిల్ చేస్తోంది. తాము టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ కోసం వెతుకుతున్నామని వేదాంత గ్రూప్ ఆఫీసర్ వెల్లడించారు.

అదే దారిలో..
ఎగ్జిక్యూటివ్ సెర్చ్ ఫర్మ్ ట్రాన్‌సెర్చ్ ఇరవై మంది టాప్ టాలెంట్‌ను నియమించుకుంటోంది. డిజిటల్, క్లౌడ్, డేటా అనలిస్ట్ వంటి న్యూఏజ్ టెక్నాలజీస్‌లో టాప్ టాలెండ్ కోసం చూస్తోంది. ప్రస్తుతం ఇండియాలో హైరింగ్ ఫ్రీజ్ చేయలేదని ఈ కంపెనీ సీహెచ్ఆర్వో ఇండియా వెల్లడించారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications