పెరిగేది కొండంత.. తగ్గేది గోరంత: కాస్త తగ్గిన బంగారంధరలు; నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!!
భారతీయులకు బంగారంతో విడదీయలేని అనుబంధం ఉంటుంది. బంగారాన్ని ఇష్టపడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతగా మన జీవితాలతో ముడివేసుకున్న బంగారం ధరలు ఇటీవల కాలంలో కొనుగోలు చేయలేనంతగా పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి అనే చెప్పాలి. 62 వేల వరకూ పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన బంగారం ధరలు ప్రస్తుతం 60 వేల నుండి 62 వేల లోపు ఊగిసలాడుతున్నాయి.
బంగారం కొనుగోలుదారులు బంగారం ధరలు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తుంటే తరచుగా కొనసాగుతున్న హెచ్చుతగ్గులు బంగారం కొనుగోలు దారులను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి. అంతలోనే ధర పెరగడం అంతలోనే ధర తగ్గటం కనిపిస్తుంది. ధర పెరిగితే కొండంత, తగ్గితే గోరంత అన్న చందంగా ఉంది.

ఇక నిన్నటికి నిన్న ఒక్కసారిగా 10 గ్రాముల 22 క్యారెట్ల మీద నాలుగు వందల రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద నాలుగు వందల నలభై రూపాయలు పెరిగిన బంగారం ధరలు నేడు కాస్త క్షీణించాయి. ఈ రోజు పది గ్రాముల 22 క్యారెట్ల మీద 150 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల మీద 170 రూపాయల మేర బంగారం ధరలు తగ్గాయి.
ప్రస్తుతం దేశీయంగా బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 55,700 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,760 రూపాయలుగా ట్రేడవుతోంది. ఇక హైదరాబాదులో ఈ రోజు 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం 55,700 రూపాయలు, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 60, 760 రూపాయలుగా ట్రేడవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,850 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 930 రూపాయలుగా ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 55,700 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,760రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం వంటి నగరాలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,700 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,760 రూపాయలుగా ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications