ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ల ధరలు ఇవ్వాళ భారీగా పడిపోయాయి. 52 వారాల కనిష్ఠానికి క్షీణించాయి. ఇవ్వాళ మధ్యాహ్నం వరకు ఏడున్నర శాతం వరకు టాటా కమ్యూనికేషన్స్ షేర్ల ధరల్లో పతనం కనిపించింది. మరింత తగ్గొచ్చనే అంచనాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమౌతోన్నాయి.
ఈ ఉదయం రూ.920.45 పైసల వద్ద ట్రేడింగ్ ఆరంభమైన తరువాత మరింత దిగజారాయి. 800 రూపాయల కంటే దిగువకు పడిపోయాయి. ట్రేడింగ్ మొదలైన 10 నిమిషాల్లోనే గరిష్ఠంగా 869.05 పైసలకు చేరింది. ఆ తరువాత కొద్దిగా పుంజుకొంది గానీ.. మంగళవారం నాటి క్లోజింగ్ ప్రైస్‌ను అందుకోలేకపోయింది. మధ్యాహ్నం 2:30 నిమిషాలకు 875 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

మధ్యాహ్నం వరకే ఒక్కో షేర్ మీద 46 రూపాయల మేర నష్టాన్ని పంచింది టాటా కమ్యూనికేషన్స్ షేర్లు. మార్కెట్ వర్గాలు మాత్రం ఆశాభావంతో ఉన్నాయి. భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా పెరుగుతుందని అంచనా వేస్తోన్నాయి. టాటా కమ్యూనికేషన్స్ షేర్ల ధరల టార్గెట్ 1,600 రూపాయలుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. మున్ముందు మళ్లీ పెరుగుతుందని స్పష్టం చేసింది.
ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా పాజిటివ్‌గా స్పందించింది. టాటా కమ్యూనికేషన్స్ షేర్ల ధరలను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయంగా పేర్కొంది. దీని టార్గెట్‌గా 1,155 రూపాయలుగా పేర్కొంది. బ్రోకరేజ్ ఫర్మ్ సీఎల్ఎస్ఏ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ కంపెనీ షేర్ల టార్గెట్ ప్రైస్ 1,070 రూపాయలుగా నిర్దేశించినట్లు వివరించింది.
ప్రముఖ స్టార్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పెద్ద ఎత్తున షేర్లను కొనుగోలు చేసిన కంపెనీ ఇది. ఆయన భార్య రేఖ ఝున్‌ఝున్‌వాలా పేరు మీద ఇందులో 30,75,687 షేర్లు ఉన్నాయి. కంపెనీ స్టేక్స్‌తో పోల్చుకుని చూస్తే 1.08 శాతం వాటా రేఖ ఝున్‌ఝున్‌వాలా పేరు మీదే ఉంది.


Click it and Unblock the Notifications