For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 రోజుల్లో సెన్సెక్స్ 3000 పాయింట్లు పతనం: టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఇవే..

|

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతోంది. గురువారం (జనవరి 28) సూచీలు ఒక దశలో 500 పాయింట్లకు పైగా పతనమైంది. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 377.99 పాయింట్లు లేదా 0.80% నష్టపోయి 47,031.94 పాయింట్ల వద్ద, నిఫ్టీ 113.10 పాయింట్లు లేదా 0.81% క్షీణించి 13,854.40 పాయింట్ల వద్ద ఉంది. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ 540 పాయింట్లకు పైగా నష్టపోయింది. 5 రోజుల్లో 3000 పాయింట్ల వరకు నష్టపోయింది. 301 షేర్లు లాభాల్లో, 883 షేర్లు నష్టాల్లో ఉండగా, 54 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స్టాక్స్ టాప్ లూజర్‌గా ఉంది.

పరిహారం చెల్లించకపోతే ఆ ఆస్తులు జఫ్తు చేస్తాం: భారత్‌కు కెయిర్న్ తీవ్ర హెచ్చరికపరిహారం చెల్లించకపోతే ఆ ఆస్తులు జఫ్తు చేస్తాం: భారత్‌కు కెయిర్న్ తీవ్ర హెచ్చరిక

వరుసగా 5వ రోజు నష్టాల్లో

వరుసగా 5వ రోజు నష్టాల్లో

మార్కెట్లు వరుసగా 5వ రోజు నష్టాల్లో ఉన్నాయి. నిన్నటి వరకు 2వేలకు పైగా సెన్సెక్స్ నష్టపోయింది. ఈ రోజు మరో 500 పాయింట్ల వరకు క్షీణించింది. సెన్సెక్స్ ఉదయం 46,834.57 వద్ద ప్రారంభమై, 47,172.02 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి, 46,821.21 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. కాస్మో ఫిల్మ్స్‌, వొడాఫోన్ ఐడియా, ఐనాక్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండటంతో ఐదు రోజులుగా స్టాక్స్ నష్టపోతున్నాయి. దీనికి తోడు డెరివేటివ్ చివరి రోజు కావడంతో విక్రయాలు కొనసాగాయి. ఎనర్జీ, గ్యాస్ రంగాల సూచీలు మినహా అన్ని నష్టాల్లో ఉన్నాయి. బడ్జెట్ సమీపిస్తుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు 4.47 శాతం, BPCL 1.84 శాతం, హీరో మోటోకార్ప్ 1.62 శాతం, టాటా మోటార్స్ 1.42 శాతం, IOC 1.15 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో HDFC బ్యాంకు 3.83 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 3.25 శాతం, విప్రో 3.06 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.78 శాతం, HUL 2.51 నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 స్టాక్స్ 1.06 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.07 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ బ్యాంకు 1.01 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.75 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.10 శాతం, నిఫ్టీ ఐటీ 1.88 శాతం, నిఫ్టీ మెటల్ 0.88 శాతం, నిఫ్టీ ఫార్మా 0.14 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.94 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.90 శాతం, నిఫ్టీ ఆటో 0.49 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.69 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ 0.11 శాతం, నిఫ్టీ ఆటో 0.49 శాతం, నిఫ్టీ మీడియా 0.76 శాతం లాభాల్లో ఉన్నాయి.

English summary

5 రోజుల్లో సెన్సెక్స్ 3000 పాయింట్లు పతనం: టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఇవే.. | Sensex still deep in red, hovers around 47,000, Nifty below 13,900

Except energy, all other sectoral indices are trading in the red with PSU Bank index fell nearly 2 percent. Tech Mahindra, HDFC Bank, UPL, Power Grid Corp and Sun Pharma were among major losers on the Nifty.
Story first published: Thursday, January 28, 2021, 12:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X