For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాది చివరలో ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్, నష్టంతో రిలయన్స్ ముగింపు

|

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం(డిసెంబర్ 31) ఫ్లాట్‌గా ముగిశాయి. 2020 క్యాలెండర్ ఏడాది ప్రారంభంలో భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, కరోనా కారణంగా మార్చి నుండి పతనమయ్యాయి. ఆ తర్వాత ఇటీవల రికవరీ నేపథ్యంలో సూచీలు భారీ లాభాల్లో ఉండటంతో పాటు, కొత్త శిఖరాలను తాకుతున్నాయి. నిన్నటి వరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు, నేడు మాత్రం ఫ్లాట్‌గా ముగిసింది. నేడు స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కదలాడాయి. చివరకు అతి స్వల్ప లాభాలతో ముగిశాయి.

రిలయన్స్ ఎఫెక్ట్, ముఖేష్ అంబానీని దాటేసిన చైనీస్ కుబేరుడు జోంగ్ షంషాన్‌రిలయన్స్ ఎఫెక్ట్, ముఖేష్ అంబానీని దాటేసిన చైనీస్ కుబేరుడు జోంగ్ షంషాన్‌

సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్‌గా

సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్‌గా

సెన్సెక్స్ నేడు 5 పాయింట్లు(0.01 శాతం) లాభపడి 47,751.33 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ అతి స్వల్పంగా 0.0014 శాతం నష్టపోయి 13,981.75 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఐటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. మీడియా, రియాల్టీ సూచీలు మాత్రం లాభాల్లో ముగిశాయి. డాలర్ మారకంతో రూపాయి నేడు 24 పైసలు లాభపడి 73.07 వద్ద క్లోజ్ అయింది. నేటి గరిష్టం 73.01 వద్ద, కనిష్టం 73.17 వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి మోస్ట్ గెయినర్స్ జాబితాలో HDFC 1.61 శాతం, సన్ ఫార్మా 1.43 శాతం, హిండాల్కో 1.33 శాతం, ICICI బ్యాంకు 1.19 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.11 శాతం లాభాల్లో ఉన్నాయి.

నేటి టాప్ లూజర్స్ జాబితాలో శ్రీసిమెంట్స్ 2.39 శాతం, టీసీఎస్ 1.60 శాతం, భారతీ ఎయిర్ టెల్ 1.25 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.24 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 1.11 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.

రిలయన్స్ స్టాక్ నేడు ప్రారంభంలో రూ.2000 పైన ట్రేడ్ అయినప్పటికీ, మధ్యాహ్నం కిందకు పడిపోయింది. చివరకు 0.69 శాతం నష్టపోయి రూ.1981.80 వద్ద ముగిసింది.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ మిడ్ క్యాప్ 0.72 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.31 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.30 శాతం, నిఫ్టీ మీడియా 0.98 శాతం, నిఫ్టీ మెటల్ 0.74 శాతం, నిఫ్టీ ఫార్మా 0.72 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.23 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ బ్యాంకు 0.12 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.15 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.40 శాతం, నిఫ్టీ ఐటీ 0.32 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.49 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.07 శాతం నష్టపోయాయి.

English summary

ఏడాది చివరలో ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్, నష్టంతో రిలయన్స్ ముగింపు | Sensex, Nifty end last day of 2020 on flat note

Nifty Bank, PSU Bank, Private Bank, FMCG and IT indices ended in the red. Media and Realty indices rose about a percent.
Story first published: Thursday, December 31, 2020, 18:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X