ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ పతనం ఇవ్వాళ కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టపోయాయి. సెన్సెక్స్‌లో ఉన్న షేర్లన్నీ రెడ్ జోన్‌లో కనిపించాయి.. ఒక్క బ్యాంకింగ్ సెగ్మెంట్ తప్ప. ఐటీ, రియాల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్.. ఇలా అన్నీ కీలకమైన బెంచ్‌మార్క్ ఇండైసెస్ అన్నీ నష్టపోయాయి. మైనస్‌లల్లో పడిపోయాయి. బ్యాంకింగ్ సెక్టార్‌కు సంబంధించిన షేర్లు మాత్రం కొంత కళకళలాడాయి.

300 పాయింట్లు లాస్..
ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 303.35 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది. 54,060 పాయింట్లతో ఇవ్వాళ సెన్సెక్స్ ట్రేడింగ్ ఆరంభమైంది. ఒక దశలో 54,197 పాయింట్లను సైతం టచ్ చేసింది. అక్కడి నుంచి కిందికి జారింది దీని గ్రాఫ్. నేల చూపులు చూస్తూ సాగింది ఇవ్వాళ్టి దాని ప్రయాణం.

కొంత కోలుకున్నా..
చివరిగంటలో కోలుకున్నట్టే కనిపించింది. రికవరీ అవుతుందనుకున్న దశలో మళ్లీ కూలింది. మధ్యాహ్నం 2:20 నిమిషాల సమయంలో 53,981 పాయింట్ల వరకు వెళ్లింది గానీ.. ఎక్కువ సేపు అక్కడే స్థిరంగా నిలవలేకపోయింది. ఒకదశలో 53,730 పాయింట్లకు క్షీణించింది. ట్రేడింగ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు కొంత పుంజుకొంది మార్కెట్. చివరికి 53,749.26 పాయింట్ల వద్ద ఇవ్వాళ్టి ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీ ప్రయాణం కూడా సాఫీగా సాగలేదు. 99 పాయింట్లకు పైగా నష్టపోయింది. 16,025.80 పాయింట్ల వద్ద దీని ట్రేడింగ్ క్లోజ్ అయింది.

ఏసియన్ పెయింట్.. పేటీఎం..
ఇవ్వాళ భారీగా నష్టపోయిన షేర్లల్లో పేటీఎం, ఏసియన్ పెయింట్స్ ఉన్నాయి. 247 రూపాయల మేర నష్టపోయింది ఏసియన్ పెయింట్స్ షేర్ ధర. ఈ ఉదయం రూ.3,034.90 పైసల వద్ద దీని ట్రేడింగ్ ఆరంభమైంది. తొలి గంట నుంచే పతనావస్థలో కనిపించింది. మధ్యాహ్నానికి 247.85 రూపాయలను నష్టపోయింది. 2,839 వద్ద ట్రేడింగ్ ముగిసింది. పేటీఎం షేర్ ఒక్కింటికి రూ.54.95 పైసలు నష్టపోయింది. 647 రూపాయలతో ఆరంభమైన ట్రేడింగ్.. రూ.591.50 పైసల వద్ద ముగిసింది.

అదే దారిలో ఎల్‌ఐసీ..
ఇటీవలే మార్కెట్‌లో డెబ్యూ అయిన జీవిత బీమా సంస్థ షేర్లల్లో మహా పతనం కొనసాగుతూనే వస్తోంది. రూ.8.95 పైసల మేర నష్టపోయిందీ షేర్ ధర. ఈ ఉదయం రూ.831.50 పైసల వద్ద ఆరంభమైన ఈ ఎల్ఐసీ షేర్ల ట్రేడింగ్ రూ.814.95 పైసల వద్ద ముగిసింది. వీటితో పాటు అదాని పోర్ట్స్, దివిస్ ల్యాబ్స్, యూపీఎల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, నిఫ్టీలో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతి ఎయిర్‌టెల్ లాభపడ్డాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications