For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండ్రోజుల తర్వాత లాభాల్లోకి బ్రిటానియా, 'ఐటీ' ఊగిసలాట

|

ముంబై: దేశీయ భారత స్టాక్ మార్కెట్లు గురువారం(అక్టోబర్ 22) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 71.54 పాయింట్లు (0.18%) క్షీణించి 40,635.77 వద్ద, నిఫ్టీ 25.50 పాయింట్లు(0.21%) నష్టపోయి 11912.20 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ ఓ దశలో 180 పాయింట్లకు పైగా క్షీణించినప్పటికీ, ఆ తర్వాత నష్టాలు తగ్గాయి.

492 షేర్లు లాభాల్లో, 443 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 39 షేర్లలో ఎలాంటి మార్పులేదు. నేడు ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఆటో, భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, ఎస్బీఐ కార్డ్స్ పేమెంట్ సర్వీసెస్, హెక్సావేర్ టెక్నలజీస్, ఇండియన్ బ్యాంకు, బయోకాన్ త్రైమాసిక ఫలితాలు ఉన్నాయి.

గూగుల్ బాటలోనే.. ఉద్యోగుల ఆరోగ్యం కోసం అమెజాన్ కీలక నిర్ణయంగూగుల్ బాటలోనే.. ఉద్యోగుల ఆరోగ్యం కోసం అమెజాన్ కీలక నిర్ణయం

ఐటీ, రియాల్టీ, మీడియా మాత్రమే లాభాల్లో..

ఐటీ, రియాల్టీ, మీడియా మాత్రమే లాభాల్లో..

అన్ని రంగాలు కూడా ఈ రోజు నష్టాల్లో సాగుతున్నాయి.

రూ.6000 కోట్ల నిధుల సమీకరణకు గ్రాండ్ ఫార్మాకు సెబీ ఆమోదం తెలిపింది.

నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్స్ సర్వీస్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు నష్టాల్లో కనిపించాయి.

నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియాల్టీ మాత్రమే లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

డాలర్ మారకంతో రూపాయి 73.76 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 73.58 వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

ఉదయం గం.11 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, బ్రిటానియా, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, లార్సన్ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, హిండాల్కో, ఐచర్ మోటార్స్, హీరో మోటో కార్ప్ ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ జాబితాలో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంకు, అల్ట్రా టెక్ సిమెంట్ ఉన్నాయి.

బజాజ్ ఫిన్ సర్వ్ 3 శాతం లాభపడింది. రెండో క్వార్టర్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో ఈ స్టాక్స్ ఎగిశాయి.

రెండు రోజుల పాటు నష్టాల్లో ఉన్న బ్రిటానియా నేడు లాభాల్లోకి వచ్చాయి. 1.40 శాతం లాభపడి రూ.3,445 వద్ద ట్రేడ్ అయింది.

ఐటీ స్టాక్స్‌లో హెచ్చుతగ్గులు..

ఐటీ స్టాక్స్‌లో హెచ్చుతగ్గులు..

టీసీఎస్ షేర్ ధర 0.58 శాతం నష్టపోయి రూ.2,660 వద్ద ట్రేడ్ అయింది. హెచ్‌సీఎల్ టెక్ 0.029 శాతం నష్టపోయి రూ.870.60, ఇన్ఫోసిస్ షేర్ 0.33 శాతం క్షీణించి రూ.1,144.50, టెక్ మహీంద్ర 0.79 శాతం నష్టపోయి రూ.840 వద్ద, కోఫోర్జ్ 1.55 శాతం నష్టపోయి రూ.2,472 వద్ద ట్రేడ్ అయింది.

మైండ్ ట్రీ 3 శాతం ఎగిసి రూ.1395.45 వద్ద, విప్రో 0.28 శాతం ఎగిసి రూ.344 వద్ద ట్రేడ్ అయింది.

ఐటీ స్టాక్స్ లాభాల్లో ప్రారంభమై, ఆ తర్వాత హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి.

English summary

రెండ్రోజుల తర్వాత లాభాల్లోకి బ్రిటానియా, 'ఐటీ' ఊగిసలాట | Sensex down over 180 points, Nifty around 11,900

Indian indices were trading lower on Thursday led by a decline in pharma, financials and IT stocks. Meanwhile, Bajaj Finserv and Bajaj Finance rose in early deals after they announced their September quarter results.
Story first published: Thursday, October 22, 2020, 12:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X