For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శిబూలాల్ కీలక నిర్ణయం, ఇన్ఫోసిస్‌లో 85 లక్షల షేర్లు విక్రయం: ఎందుకంటే

|

ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎస్డీ శిబూలాల్, అతని ఫ్యామిలీ రూ.780 కోట్ల విలువైన 85 లక్షల ఇన్ఫీ షేర్లను విక్రయించారు. ఇటీవల మంచి ఫలితాలు వచ్చిన సమయంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వీరి కుటుంబం మొత్తం 0.20 శాతం వాటాను వదులుకుంది. ఇందులో శ్రేయాస్ శిబూలాల్ అత్యధికంగా 0.09 శాతం వాటాను వదులుకున్నారు. జూలై 22వ తేదీ నుండి జూలై 24వ తేదీ మధ్య మూడు సెషన్లలో వీరు ఈ వాటాలు విక్రయించారు. ఈ మేరకు విక్రయం జరిగినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ సమాచారం వెల్లడిస్తోంది.

గుడ్‌న్యూస్: ఐటీలో వేలాది ఆఫర్స్, HCLలో 15,000 ఉద్యోగాలుగుడ్‌న్యూస్: ఐటీలో వేలాది ఆఫర్స్, HCLలో 15,000 ఉద్యోగాలు

వాటాల విక్రయం ద్వారా వచ్చిన మొత్తంతో...

వాటాల విక్రయం ద్వారా వచ్చిన మొత్తంతో...

ఇన్ఫీలో ఈ విక్రయానికి సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ మధ్యవర్తిత్వం వహించింది. వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని దాతృత్వం, పెట్టుబడి కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు శిబులాల్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,92,962.68 వద్ద వీటిని విక్రయించారు. శిబూలాల్ 1981 అక్టోబర్ నుండి 2014 వరకు ఇన్ఫోసిస్‌లో వివిధ హోదాల్లో పని చేశారు. 2011 నుండి 2014 ఇన్ఫీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ప్రస్తుతం శిబూలాల్ స్టార్టప్స్ టెక్నాలజీపై దృష్టి సారిస్తున్న ఆక్సిలర్ వెంచర్స్ కో-పౌండర్ కూడా. దీనిని మరో ఇన్ఫీ సహ వ్యవస్థాపకులు క్రిష్ గోపాలకృష్ణన్‌తో కలిసి ప్రారంభించారు. శిక్షాలోకమ్ అనే సంస్థ ద్వారా దాతృత్వ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. వివిధ రాష్ట్రాల్లో హైస్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతి కోసం పాటుపడుతున్నారు.

ఎవరి షేర్లు ఎన్ని విక్రయించారు

ఎవరి షేర్లు ఎన్ని విక్రయించారు

రూ.365.67 కోట్ల విలువైన శ్రేయ శిబూలాల్ వాటాలు విక్రయించారు. విక్రయించిన 0.20 శాతం వాటాలో వీరివే 0.09 శాతంగా ఉన్నాయి. మిగతా వాటాల విక్రయం విషయానికి వస్తే కుమార్ శిబూలాల్ (రూ.109.69 కోట్లు) 0.03 శాతం వాటా, గౌరవ్ మాన్‌చంద (రూ.164.47 కోట్లు) 0.04 శాతం, మిలాన్ శిబూలాల్ మన్‌చంద (రూ.137.18 కోట్లు) 0.03 శాతం వాటాలు విక్రయించారు. మొత్తం రూ.777..01 కోట్ల షేర్లు (0.19 శాతం) విక్రయించారు.

తగ్గిన వాటాలు

తగ్గిన వాటాలు

జూన్ 30వ తేదీ నాటికి ఇన్ఫోసిస్‌లో 2.24 శాతం వాటా ఉంది. శిబూలాల్ వాటాలు 0.4 శాతం, భార్య కుమారి శిబూలాల్ వాటా 0.25 శాతం, తనయుడు శ్రేయాస్ శిబూలాల్ వాటాలు 0.66 శాతం, కూతురు శృతి శిబూలాల్ వాటా 0.06 శాతంగా ఉంది. మనవడు మిలాన్ 0.36 శాతం, అల్లుడు గౌరవ్ మాన్‌చంద 0.36 శాతం వాటా, కోడలు భైరవి 0.15 శాతం వాటా కలిగి ఉన్నారు. శ్రేయాస్ శిబూలాల్ 2019లోనే పెద్ద ఎత్తున వాటాలు విక్రయించారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఆధారిత స్టార్టప్ పైన ఇన్వెస్ట్ చేసేందుకు విక్రయించారు. గత కొంతకాలంగా దాతృత్వకార్యకలాపాలు, ఇతర స్టార్టప్స్‌లో పెట్టుబడి కోసం వాటాలు తగ్గించుకుంటున్నారు. 1981లో 250 అమెరికన్ డాలర్లతో ఎస్డీ శిబూలాల్‌తో పాటు నారాయణ మూర్తి, నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్, కే దినేష్, ఎన్ఎస్ రాఘవన్ కలిసి ఇన్ఫీని స్థాపించారు.

English summary

శిబూలాల్ కీలక నిర్ణయం, ఇన్ఫోసిస్‌లో 85 లక్షల షేర్లు విక్రయం: ఎందుకంటే | SD Shibulal and family sell 8.5 million Infosys shares

The family members of Infosys co-founder SD Shibulal have sold a portion of their stake in the IT major over the last three sessions, representing 0.20 per cent of the paid-up equity share capital.
Story first published: Sunday, July 26, 2020, 9:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X