For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనాకు శాంసంగ్ షాక్, మోడీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌కు మరో అడుగు

|

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌కు చైనాకు షాకిచ్చింది. చైనా నుండి తన డిస్‌ప్లే ఫ్యాక్టరీని ఉత్తర ప్రదేశ్‌కు తరలించనుంది. శాంసంగ్ తన ప్లాంటును తరలిస్తున్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ప్రధాని నరేంద్ర మోడీ భారత్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ మేకిన్ ఇండియాకు శాంసంగ్ రాక మరింత ప్రోత్సాహన్ని ఇస్తుంది.

ఆధునాతన టెక్నాలజీ

ఆధునాతన టెక్నాలజీ

శాంసంగ్ తన మొబైల్, ఐటీ డిస్‌ప్లే ప్రొడక్షన్ యూనిట్‌ను చైనా నుండి భారత్‌కు తరలించనుంది. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో భారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో దేశంలోని శాంసంగ్‌కు చెందిన మొదటి హైటెక్నిక్ ప్రాజెక్టుగా ఇది అవతరిస్తుంది. ప్రపంచంలోనే ఈ ఆధునాతన యూనిట్ ఉన్న మూడో దేశంగా భారత్ నిలుస్తుంది. శాంసంగ్ తన యూనిట్‌ను చైనా నుండి ఉత్తర ప్రదేశ్ తరలించనుందని యూపీ పరిపాలనా యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది.

స్థానికులకు ఉద్యోగాలు

స్థానికులకు ఉద్యోగాలు

ప్రపంచంలోనే ఎక్కువ మొబైల్ వినియోగించే రెండో దేశం భారత్. అంతేకాదు, మొబైల్ ఫోన్ల వినియోగం రోజురోజు వేగంగా వృద్ధి సాధిస్తోంది. శాంసంగ్ వంటి మొబైల్స్ దేశంలో విస్తరించడానికి ఇది కూడా దోహదపడింది. యూపీలో శాంసంగ్ మొబైల్ యూనిట్ వల్ల చాలామందికి ఉద్యోగాలు రానున్నాయి. శాంసంగ్ ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌లో ప్రపంచంలోనే మరో అతిపెద్ద కర్మాగారం కలిగి ఉంది. దీనిని 2018లో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇప్పుడు మరో యూనిట్ ద్వారా స్థానికులకు 510 ఉద్యోగాలు రానున్నాయి.

శాంసంగ్‌కు ప్రోత్సాహకాలు

శాంసంగ్‌కు ప్రోత్సాహకాలు

శాసంగ్‌కు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించింది. శుక్రవారం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం'శాంసంగ్‌ డిస్‌ప్లే నోయిడా ప్రైవేట్ లిమిటెడ్'కు ప్రత్యేక ప్రోత్సాహకాలను శుక్రవారం ఆమోదించింది. 'ఉత్తర ప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ 2017' ప్రకారం భూమిని బదిలీ చేయడంలో శాంసంగ్‌కు స్టాంప్ డ్యూటీ మినహాయింపు లభిస్తోంది. తయారీ ఎలక్ట్రానిక్ భాగాలు, సెమీ-కండక్టర్స్ ప్రమోషన్ కోసం భారత ప్రభుత్వ పథకం కింద ఇది రూ.460 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. దీంతో శాంసంగ్ రూ.4,825 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక పథకం(PLI)కింద ఆపిల్ పార్ట్‌నర్స్‌ ఫాక్స్‌కాన్‌, విస్ట్రాన్, పెగాట్రాన్ కంపెనీలకు భారత ప్రభుత్వ పచ్చజెండా ఊపింది. ఇప్పుడు శాంసంగ్‌కు అనుమతి లభించింది. ఈ కంపెనీలు రూ.15 వేల లోపు ధరతో మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేయనున్నారు. దాదాపు 40 బిలియన్ల విలువైన హ్యాండ్‌సెట్స్‌ను ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం.

English summary

చైనాకు శాంసంగ్ షాక్, మోడీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌కు మరో అడుగు | Samsung is moving its display factory from China to Uttar Pradesh

Uttar Pradesh has said it will give financial incentives to South Korea's Samsung Electronics Co to set up a ₹48.25 billion ($654.36 million) display factory.
Story first published: Sunday, December 13, 2020, 8:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X