ఆదాయపు పన్ను విభాగం (ఐటీ డిపార్టుమెంట్) ఏప్రిల్ 8వ తేదీ నుండి జూలై 11వ తేదీ మధ్య 21.24 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.71,229 కోట్ల రీఫండ్స్ జారీ చేసింది. ఇందులో వ్యక్తిగత ఆదాయపు పన్ను రీఫండ్స్ వ్యాల్యూ రూ.24,603 కోట్లు కాగా, కార్పోరేట్ పన్ను రీఫండ్స్ రూ.46,626 కోట్లు. ఐటీ రీఫండ్స్ పొందినవాళ్లలో వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య 19.79 లక్షలు కాగా, కార్పోరేట్ పన్ను చెల్లింపుదారులు 1.45 లక్షలు.

ఈ-మెయిల్స్‌కు సత్వరమే స్పందిస్తే..
పెండింగ్‌లో ఉన్న రీఫండ్స్ జారీని ప్రాధాన్య అంశంగా పరిగణిస్తూ సత్వర మంజూరుకు ప్రయత్నిస్తున్నామని, ఈ ప్రక్రియను 2020 ఆగస్ట్ 31వ తేదీలోగా పూర్తి చేసే అవకాశం ఉందని ఆదాయపు పన్ను విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదాయపు పన్ను విభాగం పంపే ఈ-మెయిల్స్‌కు సత్వరమే పన్ను చెల్లింపుదారులు స్పందిస్తే రీఫండ్స్‌ను సాధ్యమైనంత త్వరగా జారీ చేసే వీలు ఉంటుందని సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) వెల్లడించింది. రీఫండ్స్ అన్నింటినీ ఆన్ లైన్ ద్వారా లేదంటే నేరుగా పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని తెలిపింది.

క్రమంగా పరిష్కారం
'ఐటీ డిపార్టుమెంట్ నుండి వచ్చిన మెయిల్స్‌కు ట్యాక్స్ పేయర్ నుండి సత్వర సమాధానం వస్తే త్వరగా ప్రాసెస్ చేయడానికి దోహదపడుతుంది. ఇప్పటికే చాలామంది ట్యాక్స్ పేయర్స్ ఎలక్ట్రానికల్‌గా రెస్పాండ్ అయ్యారు. వీటిని క్రమంగా పరిష్కరిస్తున్నాం. అన్ని రీఫండ్స్‌ను ఆన్ లైన్ ద్వారా లేదా నేరుగా పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాల్లో జారీ చేస్తున్నాం' అని సీబీడీటీ ఓ ప్రకటనలో తెలిపింి.

1.74 లక్షల మెయిల్స్ కోసం వెయిటింగ్
ఏప్రిల్ ప్రారంభం నుండి దాదాపు 1.74 లక్షల కేసుల్లో ఈ-మెయిల్ రెస్పాన్స్ కోసం ఐటీ డిపార్టుమెంట్ వేచి చూస్తోందని తెలిపింది. ఐటీ రీఫండ్స్ కోసం వారం రోజుల్లో సమాధానం పంపాలని సూచించినట్లు తెలిపింది. కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో రూ.5 లక్షల లోపు ఉన్న ఐటీ రీఫండ్స్‌ను వేగవంతంగా రిటర్న్ చేస్తామని ఐటీ విభాగం తెలిపింది. 5-7 వర్కింగ్ డేస్‌లలో వీటిని జమ చేస్తామని సీబీడీటీ తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications