కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు లేక వ్యాపారాలు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించడం లేదా వేతనాల్లో కోత విధించడం చేస్తున్నాయి. కరోనా ప్రభావం దేవుడిపై కూడా పడింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో దేవాలయాలు, చర్చిలు, మసీదులు క్లోజ్ అయ్యాయి. అయితే ప్రార్థనాలయాల్లో కూడా ఉద్యోగాల తొలగింత కనిపిస్తోంది.

1,300 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింత
కరోనా, లాక్ డౌన్ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డుకు మ్యాన్‌పవర్‌ను సరఫరా చేసే ఏజెన్సీలు పలువురు ఉద్యోగులను ఇంటికి పంపించాయి. టీటీడీతో మ్యాన్‌పవర్ సరఫరా చేసే సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ఏప్రిల్ 30వ తేదీతో ముగిసింది. దీంతో పనులు నిలిచిపోయి 1,300 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. గుడిలో పని చేసే శానిటేషన్, హాస్పిటాలిటీ కాంట్రాక్టు వర్కర్లకు మే 1వ తేదీ నుండి పనిలోకి రావొద్దని చెప్పారు.

మానవతా దృక్పథంతో పరిశీలిస్తాం
ఏప్రిల్ 30వ తేదీతో ముగిసిన ఒప్పందాన్ని పునరుద్ధరించలేదని చెబుతున్నారు. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. మ్యాన్ పవర్‌ను సరఫరా చేసే సంస్థల సేవలు నిలిచినట్లుగా తెలిసిందని, మానవతా దృక్పథంతో దీనిని పరిశీలిస్తామని ఆయన ఊరట కలిగించారు.

లాక్ డౌన్ కారణంగా...
టీటీడీ, మ్యాన్ పవర్ ఏజెన్సీ మధ్య ఒప్పందం ఏప్రిల్ 30వ తేదీతో ముగిసిందని, సాధారణంగా ఈ సమయానికి కొత్త టెండర్లు పిలుస్తారని, లాక్ డౌన్ కారణంగా టీటీడీ బోర్డు భేటీ కాలేదని, దీంతో టెండర్లు ఖరారు కాలేదని టీటీడీ అధికార ప్రతినిధి ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. నిబంధనల మేరకు అంతా జరిగిందని, పైగా ఇప్పుడు కార్మికులకు పని లేదని, అన్ని గెస్డ్ హౌస్‌లు మూసివేయబడ్డాయని చెబుతున్నారు. కరోనా కారణంగా తిరుమలతో పాటు టీటీడీ పరిపాలనలోని 50 ఉద దేవాలయాలు కూడా మూసివేయబడ్డాయి. 128 ఏళ్లలో ఆలయం మూసివేయడం ఇదే తొలిసారి.

వీ-వర్క్‌లో ఉద్యోగాల కోత
ఇదిలా ఉండగా, వివిధ సంస్థలు కూడా ఉద్యోగులను తొలగిస్తోన్న విషయం తెలిసిందే. కో వర్కింగ్ కంపెనీ వీ-వర్క్ ఇటీవల ఉద్యోగులను తొలగించింది. వీ-వర్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సందీప్ మాట్లాడుతూ.. మరిన్ని ఉద్యోగాల కోత ఉంటుందని ముందే చెప్పామని, గత ఏడాదితో పాటు ఈ మార్చిలోనే 240 మంది ఉద్యోగులను తొలగించినట్లు చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో కార్యకలాపాలు ముందుకు సాగడం లేదని, కాబట్టి ఈ వారంలో ఉద్యోగాల కోతతో పాటు వచ్చే నెలలోను మరిన్ని కోతలు ఉండవచ్చునని వార్తలు వస్తున్నాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications