హమ్మయ్య.. తగ్గిన బంగారం ధరలు; నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!!
రెండు రోజులుగా విపరీతంగా పెరిగిన బంగారం ధరలు నేడు కాస్త తగ్గింది. రికార్డులు బద్దలు కొడుతూ పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు కొద్దిగా మళ్ళీ తగ్గాయి. అయినప్పటికీ బంగారం ధరలు 60,000 మార్కును దాటే కొనసాగుతున్నాయి. నేడు బంగారం ధరల విషయానికి వస్తే నేడు 22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయలు తగ్గితే, 24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయల మేర తగ్గింది.
నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు చూస్తే హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,900గా నేడు ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో 60,980గా విక్రయించబడుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో 56,050 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 61,130 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,900గా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 980 రూపాయలుగా కొనసాగుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,950 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 61 వేల 30 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,900 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 980 రూపాయలుగా విక్రయించబడుతుంది.

ఇక బంగారం ధరలలో దేశంలోనే అధికంగా ధరలు ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం, తిరుచ్చి, తిరుపూరు, తిరునవ్వేలి, ఈ రోడ్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,500 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,640గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మార్చి 28న 54,500 రూపాయలు ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర, నేడు ఏప్రిల్ 6 నాటికి 55,900 రూపాయలకు చేరుకుంది. పది రోజుల్లో 1400 రూపాయల మేర ఆర్నమెంట్ బంగారం ధర పెరిగింది.


Click it and Unblock the Notifications