హైదరాబాద్: లాక్ డౌన్ తర్వాత తెలంగాణలో పారిశ్రామిక రంగం అనుసరించాల్సిన వైఖరి, కొత్త వ్యాపార అవకాశాలు ఇతర అంశాలపై దార్శనిక పత్రం రూపొందించాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు శనివారం CIIని కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలు సహా అన్ని రంగాల్లోని పారిశ్రామిక వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. లైఫ్ సైన్సెస్, మెడికల్ రంగాల్లోని అవకాశాలను సద్వివినియోగం చేసుకోవాలన్నారు.

ఉద్యోగాలు తొలగించవద్దు
శనివారం కేటీఆర్ సీఐఐ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నష్టాల పేరుతో ఉద్యోగులను తొలగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు లేదా లాక్ డొన్ తర్వాత సిబ్బందిని తొలగించవద్దని కోరారు. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చొరవ తీసుకోవాలన్నారు. ఉద్యోగులను తీసివేయకుండా మరో మార్గంలో ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు.

ఇలా చేయండి..
వేతనాల తగ్గింపు, బోనస్ వాయిదా, ఇంక్రిమెంట్ వాయిదా వంటి వాటి ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆర్థికంగా అన్ని రంగాలు గడ్డు పరిస్థితుల్లోనే ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. లాక్ డౌన్ వల్ల పారిశ్రామిక రంగం వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ఉత్పత్తి లేక ఆదాయం కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ దెబ్బతింటోందన్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల పట్ల యాజమాన్యాలు దయతో వ్యవహరించాలన్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఉద్యోగులను తొలగించరాదన్నారు.

సీఎం సహా జీతాలు తగ్గించుకున్నారు
ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు కూడా వేతనాలు తగ్గించుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. కంపెనీ యజమానులు బాధ్యతాయుత పౌరులుగా ఉద్యోగుల భద్రతకు కృషి చేయాలన్నారు. వివిధ రంగాలు మళ్లీ పూర్వవైభవం పొందేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం వేతనాలు కట్ చేసి వాయిదా పద్ధతుల్లో చెల్లించాలని నిర్ణయించామన్నారు. దీనిని పరిగణలోకి తీసుకోవాలన్నారు.

త్వరలో పరిశ్రమలు పుంజుకుంటాయి
లాక్ డౌన్ తర్వాత త్వరలో పరిశ్రమలు పుంజుకుంటాయని, ఉద్యోగుల భద్రతకు యాజమాన్యాలు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. లాక్ డౌన్ అనంతరం పరిశ్రమల కొనసాగింపునకు సంబంధించి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. లాక్ డౌన్‌కు అన్నివర్గాల నుంచి సహకారం అందుతోందని, కరోనా కట్టడికి ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందన్నారు.

ఆర్థిక వ్యవస్థలో 25 శాతం మాత్రమే..
తెలంగాణకు అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు, వెంటిలెటర్లు, పరీక్షల కిట్స్‌తో సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో 25 శాతం తన కార్యకలాపాలను కొనసాగిస్తోందని, లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిశ్రమలను పూర్తిస్థాయిలో నడపడం, కార్మికుల విశ్వాసాన్ని పెంపొందించే బాధ్యత యాజమాన్యాలపై ఉందన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద అత్యవసర మౌలిక వసతుల కల్పనకు సహకరించాలని చెప్పారు.
More From GoodReturns

Layoffs: కోడింగ్ చేసే రోజులు పోయాయా? లేఆఫ్స్ భయాల మధ్య TCS సీఈఓ కీలక వ్యాఖ్యలు!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications