ఈ బ్యాంకుపై RBI ఆంక్షలు, రూ.35,000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకోలేరు
గత ఏడాది చివరలో PMC బ్యాంకులో స్కాం వెలుగు చూడటంతో కేంద్ర బ్యాంకు ఆ బ్యాంకు బిజినెస్‌పై పరిమితులు విధించడం, కస్టమర్ల క్యాష్ విత్ డ్రా చేయడంపై పరిమితి, ఆ తర్వాత కస్టమర్ల విజ్ఞప్తి మేరకు దానిని మరింత పెంచిన విషయం తెలిసిందే. పీఎంసీ బ్యాంకు స్కాం కారణంగా కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బెంగళూరుకు చెందిన మరో బ్యాంకుపై శనివారం కొరడా ఝులిపించింది.

జనవరి 10 నుంచి నో లావాదేవీలు...
సదరు బెంగళూరు బెస్డ్ ప్రయివేటు బ్యాంకు బిజినెస్ వ్యవహారాలపై ఆంక్షలు విధించింది. బ్యాంకు లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయని, దీంతో వ్యాపార లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు శనివారం అధికారులు తెలిపారు. శ్రీ గురు రాఘవేంద్ర సహకారా బ్యాంకు ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా రుణాలు, అడ్వాన్స్‌లు రాతపూర్వకంగా ఇవ్వడం లేదా మంజూరు చేయడం లేదా పునరుద్ధరించడం, పెట్టుబడులు పెట్టడం, నిధులు తీసుకోవడం, ఫ్రెష్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయలేదని, ఇది జనవరి 10, 2020 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది.

కస్టమర్లు రూ.35,000 మాత్రమే క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు
ఈ మేరకు ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ దయాల్ ముంబై నుంచి ఆదేశాలు జారీ చేసారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 లోని సెక్షన్ 35ఏ, 56 కింద ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో కస్టమర్లకు కూడా కొన్ని పరిమితులు విధించారు. ఈ బ్యాంకుకు చెందిన సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ కస్టమర్లు, డిపాజిటర్లు ఆర్బీఐ తదుపరి నోటీసు వచ్చే వరకు రూ.35,000 క్యాష్‌ను మాత్రమే విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించింది. దీంతో కస్టమర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆంక్షలతో వ్యాపారం..
ఈ ప్రయివేటు బ్యాంకు పేమెంట్స్, ఆస్తులను విక్రయించడం, ట్రాన్సుఫర్ చేయడం కూడా కుదరదు. అయితే ఈ బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగు పడే వరకు ఆంక్షలతో వ్యాపారాన్ని కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆదేశాలు జనవరి 10 నుంచి ఆరు నెలల పాటు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications