ఐటీలో ఉద్యోగాలకు భయం లేదు, కానీ: నాస్కాం మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు, వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి..

సుదీర్ఘ లాక్ డౌన్ ఉంటే ఐటీ పరిశ్రమలో ఉద్యోగాల కోతకు దారి తీయవచ్చునని నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రం దీర్ఘకాలంలో సానుకూలంగా ఉండవచ్చునని తెలిపారు. దీని ద్వారా ఐటీ కంపెనీలు పెట్టుబడులను ఆదా చేసే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. వెంచర్ క్యాపిటలిస్టుల నిధులతో స్టార్టప్స్ మనుగడ సాగిస్తున్నాయని, ప్రస్తుత పరిణామాలు మరింత దిగజారితే ఈ సంస్థలు మరితం గడ్డు పరిస్థితులు ఎదుర్కోవచ్చునన్నారు.

ఉద్యోగాలు తొలగించే అవకాశాలు తక్కువ.. ఎందుకంటే

ఉద్యోగాలు తొలగించే అవకాశాలు తక్కువ.. ఎందుకంటే

పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగులను తగ్గించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయని, ఒకటి వారు ఉద్యోగులను కోల్పోవాలని అనుకోరని, అలాగే కంపెనీల వద్ద తగినంత సొమ్ము ఉందని, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారన్నారు. ఒకవేళ పెద్ద సంస్థలు ఉద్యోగులను తొలగించాలనుకున్నా తాత్కాలిక ఉద్యోగుల్ని తగ్గించుకుంటారని లేదా పనితీరు బాగా లేకుంటతొలగిస్తారన్నారు.

రెండు మూడు నెలలు కొనసాగితే కష్టమే

రెండు మూడు నెలలు కొనసాగితే కష్టమే

ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద పెద్ద సంస్థలు రెగ్యులర్, శాశ్వత ఉద్యోగులను తొలగించాలని భావించవని చెప్పారు. కానీ లాక్ డౌన్ సుదీర్ఘకాలం ఉంటే మాత్రం ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలకు నష్టమేనన్నారు. లాక్ డౌన్ తరహా రెండు మూడు నెలల పాటు కొనసాగితే పెద్ద సంస్థలు కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుందన్నారు. ఉద్యోగులకు సబ్సిడీలు కొనసాగించలేవన్నారు.

అప్పుడే ఉద్యోగాల కోత

అప్పుడే ఉద్యోగాల కోత

మరికొన్ని నెలలపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే ఐటీ రంగంలోని పెద్ద కంపెనీల్లోనూ ఉద్యోగ కోతలు తప్పదని చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే వెంచర్ క్యాపిటలిస్టుల పెట్టుబడులతో మనుగడ సాగిస్తున్న టెక్ సంస్థలు గడ్డుకాలం ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి..

వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి..

ప్రస్తుతం చాలా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మొగ్గు చూపాయని చంద్రశేఖర్ చెప్పారు. స్వల్పకాలంలో పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపినా దీర్ఘకాలంలో ఇది పని సంస్కృతిని మార్చవచ్చునని చెప్పారు. దీని వల్ల ఐటీ సంస్థలకు ఖర్చులు కూడా ఆదా అవుతాయన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని, ఇది దీర్ఘకాలంలో ఐటీ సంస్థళకు పెట్టుబడి భారం తగ్గేందుకు దోహదం చేస్తుందన్నారు. కానీ ఆఫీస్‌లో పని చేసినంత ఈజీగా ఇంటి నుండి పని చేయలేమన్నారు.

స్టార్టప్స్‌కు ఇబ్బంది

స్టార్టప్స్‌కు ఇబ్బంది

కరోనా మహమ్మారి స్టార్టప్ సంస్థలకు తీవ్ర నష్టం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయన్నారు. జీతాలు చెల్లించడానికి తగిన నిధులు లేని చిన్న సంస్థలకే ఇబ్బంది అన్నారు. యావత్ ప్రపంచంపై కరోనా ప్రభావం ఉన్నందున సహజంగానే ఐటీ రంగంపై పడుతోందన్నారు.

డిమాండ్ తగ్గే అవకాశం

డిమాండ్ తగ్గే అవకాశం

ప్రపంచమంతా ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఐటీ పరిశ్రమకు డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నట్లు నాస్కాం మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుండే అవకాశం లేదని చెప్పారు. అన్ని ఎంతో కొంత ఒత్తిడిలో ఉన్నాయని, దీంతో డిమాండ్ తగ్గే అవకాశముందన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+