వేరే ఉద్యోగం చూసుకోండి: సీఈవో లేఖ, ఓయోలో 2,400 మంది ఉద్యోగుల తొలగింత!
న్యూఢిల్లీ: ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ ఇండియాలో 2,400 (20 శాతం వర్క్ ఫోర్స్) మందిని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. సంబంధిత వ్యక్తులు చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

వేరే ఉద్యోగం చూసుకోండి..
ఓయో భారత్‌లో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగించే ఉద్దేశ్యంలో ఉందని, వ్యాపార విభాగాలు, కార్యకలాపాల బృందాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనుందని ఇదివరకే వార్తలు వచ్చాయి. మీరు వేరే ఉద్యోగం చూసుకోవాలని, ఉద్యోగం మాన్పించాలనే నిర్ణయం తీసుకోవడం కష్టంగానే ఉందని, కానీ తప్పడంలేదని ఓయో వ్యవస్థాపకులు, సీఈవో రితేష్ అగర్వాల్ సోమవారం మెయిల్ పంపించారని వార్తలు వచ్చాయి. కానీ ఎంతమందికి మెయిల్ పెట్టారని తెలియరాలేదు.

20 శాతం ఉద్యోగులను తగ్గించుకోనుంది
కానీ రెండు వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నారని తెలుస్తోంది. మిడ్ మేనేజ్‌మెంట్, బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్, ఆపరేషన్ రోల్స్, టెక్నాలజీ ఉద్యోగులు ఇందులో ఉండవచ్చు.
20 శాతం ఉద్యోగులను తగ్గించుకోనుందని, ఈ ఏడాది మార్చి నాటికి మరోసారి కాస్ట్ కట్టింగ్ ఉండవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశ్యంలో భాగంగా ఉద్యోగులను తొలగించనున్నారు.

చైనాలోను కోత
ఓయో ఇండియాలో 12,000 మంది ఉద్యోగులు ఉంటారని అంచనా. ఓయో చైనాలోను ఉద్యోగులను తొలగించింది. 5 శాతం ఉద్యోగులను తొలగించినట్లుగా గత వారం వార్తలు వచ్చాయి.

వాల్‌మార్ట్‌లో 56 మంది
ఇదిలా ఉండగా, భారత్‌లో 56 మంది ఉద్యోగులను వాల్‌మార్ట్ ఇండియా తొలగించింది. ఇందులో ఎనిమిది మంది ఉన్నత యాజమాన్య స్థానాల్లో పని చేస్తున్న వారు ఉన్నారు. వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications