గత ఏడాది (2019)లో వాహనాల సేల్స్ భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. ఏడాది చివర్లో కాస్త పుంజుకున్నాయి. ఖరీదైన లంబోర్గనీ కారు సేల్స్ వాటాలో దక్షిణ భారతదేశం వాటా 50 శాతానికి పైగానే ఉందని ఆ కంపెనీ తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. లంబోర్గనీ ఇండియా ప్రకారం ఈ కారు ఖాతాదారుల్లో ఎక్కువ మంది ఎంటర్‌ప్రెన్యూయర్స్ ఉన్నారు.

సూపర్ కార్లపై దక్షిణాది దృష్టి
లంబోర్గినీ కారు సేల్స్ వాటా దక్షిణాదిన ఎక్కువగా ఉందని లంబోర్గినీ ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్‌తో చెప్పారు. బెంగళూరు, ఇతర దక్షిణాది ప్రాంతం కలిపి భారత లంబోర్గినీ బిజినెస్‌లో యాభై శాతానికి పైగా ఉందని చెప్పారు. ఈ ప్రాంతం వారు కూడా సూపర్ కార్ల వైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని చెప్పారు.

ఐటీ హబ్.. పెట్టుబడులు..
దేశంలోని మిగతా ప్రాంతాలలో కంటే దక్షిణాది ప్రాంతం చాలా వేగంగా వృద్ధి సాధిస్తోందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ పెట్టుబడులు రావడం వల్ల వేగమైన వృద్ధిని నమోదు చేస్తోందన్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటీ హబ్ నగరాలు కూడా పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారిందని చెప్పారు.

బెంగళూరువాసి మాత్రమే కొనుగోలు చేసిన కారు
ఈ ప్రాంతం పెట్టుబడులను బాగా ఆకర్షిస్తోందని అగర్వాల్ చెప్పారు. ఇది కూడా తమ వ్యాపారంలోని ప్రతిబింబిస్తోందని చెప్పారు. ముఖ్యంగా బెంగళూరు నగరం తమకు కీలకమైనది, వ్యూహాత్మకమైనదన్నారు. ఈ ఇటాలియన్ కార్ మేకర్‌కు చెందిన Aventador SVJ 63 కారును భారతదేశం మొత్తంలో కొనుగోలు చేసిన ఏకైక భారతీయుడు బెంగళూరువాసి.

మరో ఖరీదైన కారును తొలుత కొనుగోలు చేసిన బెంగళూరువాసి
మరో ఖరీదైన లంబోర్గినీ కారు SVJ 900ని కొనుగోలు చేసిన మొదటి భారతీయుడు కూడా బెంగళూరువాసి కావడం గమనార్హం. సూపర్ కార్లకు భారత్‌లో డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోందని, లంబోర్గినీ కార్ల అభిమానుల సంఖ్య పెరుగుతోందని అగర్వాల్ చెప్పారు.

భారత్‌లో మూడు లంబోర్గినీ షోరూంలు
భారత్‌లో మూడు లంబోర్గినీ షోరూంలు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో ఉన్నాయి. ఉత్తరాదికి ఢిల్లీ, మధ్య భారతానికి ముంబై, దక్షిణాదికి బెంగళూరు కేంద్రంగా ఉంది. హైదరాబాద్, చెన్నై మార్కెట్‌కు కూడా దాదాపు బెంగళూరు కేంద్రం సేవలు అందిస్తోంది.

ఎక్కువమంది పారిశ్రామికవేత్తలు
ఇటలీకి చెందిన లంబోర్గినీ 2019లోని తన సేల్స్‌ను ప్రకటించాల్సి ఉంది. అయితే ఆటో సేల్స్ గత ఏడాది భారీగా తగ్గిపోయాయని, కానీ సూపర్ లగ్జరీ కార్ల విక్రయాలు మాత్రం 20 శాతం మాత్రమే తగ్గాయని అగర్వాల్ చెప్పారు. లంబోర్గినీ భారత్‌లో గత సంవత్సరం ఆరోగ్యకరమైన రెండంకెల వృద్ధిని సాధించిందని చెప్పారు. లంబోర్గినీ కార్లను కొనుగోలు చేస్తున్న వారిలో ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారని చెప్పారు.

ఇటలీలో తయారీ
లంబోర్గినీ కారులో ప్రపంచవ్యాప్తంగా మూడు మోడల్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ Urus, Huracan, Aventador ఉన్నాయి. ఇవి భారత్‌లోను అందుబాటులో ఉన్నాయి. లంబోర్గినీ కార్లు అన్నీ ఇటలీలోని ఒకే ఫ్యాక్టరీలో తయారు అవుతాయి. అక్కడి నుంచి వివిద దేశాలకు ఎగుమతి అవుతాయి.

భారతలో ధరలు ఇలా..
లంబోర్గినీ కారు ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటి కలుపుకొని రూ.3.5 కోట్ల నుంచి ఉందని అగర్వాల్ చెప్పారు. భారత్‌లో లంబోర్గినీ ధరలు వివిధ కారు మోడల్స్‌ను బట్టి రూ.3.10 కోట్ల నుంచి రూ.5.13 కోట్ల మధ్య ఉన్నాయన్నారు.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications