భారత్ - చైనా లు పొరుగు దేశాలు. మిత్రులు కాదు కానీ శత్రువులూ కాదు. అయితే, మన బద్ధ శత్రువు పాకిస్తాన్ కు వత్తాసు పలుకుతుంది కాబట్టి సహజంగానే చైనా మనకూ శత్రువు లాగే కనిపిస్తుంది. ఇరు దేశాల మధ్య ఒకసారి యుద్ధం కూడా జరిగింది. బోర్డర్ లో ఎప్పుడూ ఉద్రిక్తలు ఉండనే ఉంటాయి. అయినా.. ఈ రెండు దేశాలు ఇటీవల కాలంలో చాలా మారాయి.
యుద్ధం కంటే కూడా బిజినెస్ ముద్దు అంటూ ముందుకు సాగుతున్నాయి. దీనికి బలమైన కారణాలు కూడా లేకపోలేదు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఐన తర్వాత... చైనా కు చాలా సమస్యలు వచ్చి పడ్డాయి.
చైనాలో తయారు ఐన ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా భారీగా సుంకాలు పెంచింది. అలాగే హువావే వంటి టెక్నాలజీ కంపెనీలను తమ దేశంలో కార్యకలాపాలు సాగించవద్దని నిషేధించింది. మరో వైపు చైనా లో ఉన్న అమెరికా కంపెనీలు ఆ దేశం విడిచి మరో దేశానికి తమ కార్యకలాపాలను తరలించాలని హుకుం జారీ చేసింది.
దీంతో ఇరకాటంలో పడ్డ చైనా ... ఆ ప్రభావం నుంచి బయట పడేందుకు చేస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కూడగడుతోంది. ఇందుకు ఇండియా కూడా సిద్ధంగా ఉండటం విశేషం. ప్రపంచంలోనే జనాభా పరంగా చైనా, భారత్ అతి పెద్ద దేశాలు. సుమారు 250 కోట్ల జనాభాతో మెరుగైన కొనుగోలు శక్తితో దూసుకుపోతున్న ఈ ఆసియా దేశాలు... యుద్ధం కంటే కూడా వ్యాపారానికి అధిక ప్రాధాన్యమిస్తూ ఒకరి ప్రయోజనాలు మరొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

అందుకే హువావే కు జై...
భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జింపింగ్ కు మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతోంది. అందుకే అమెరికా బహిష్కరించిన చైనా టెక్నాలజీ దిగ్గజం హువావే ను ఇండియాకు రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతిస్తున్నారు. త్వరలోనే ఇండియాలో హువావే 5జి సేవలను పరీక్షించనుంది. సామ్ సాంగ్, ఎరిక్సొన్ వంటి అతి కొద్దీ కంపెనీలు మాత్రమే పోటీలో ఉండటం వల్ల మన దేశానికి పెద్దగా ఆప్షన్స్ కూడా లేవని తేలిపోయింది. కానీ అసలు విషయం అది కాదు. అమెరికా సహా ప్రపంచ దేశాల్లో హువావే పైన చాలా అపోహలు ఉన్నాయి. తమ మొబైల్ హ్యాండ్సెట్ల ద్వారా వినియోగదారుల డేటా చౌర్యానికి పాల్పడుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా కు భారత్ మద్దతు కీలకం. మన దేశంలో హువావే ను 5జి సేవల ప్రారంభానికి అనుమతిస్తే... ఆ అపోహలు తొలగించుకునేందుకు చైనా కు బాగా ఉపయోగపడుతుంది. అందుకే మోడీ తన స్నేహితుడికి ఈ కనుక ఇస్తున్నారు.

100 బిలియన్ డాలర్లు ...
చైనా - ఇండియా ల మధ్య వాణిజ్యం కూడా భారీ స్థాయిలోనే జరుగుతోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ 7,00,000 కోట్లు) కు చేరుకోనుంది. అయితే, ఇందులో చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల వాటా 80% కాగా... ఇండియా నుంచి జరిగే ఎగుమతులు కేవలం 20% మేరకే ఉండటం ఆందోళనకరం. అయినప్పటికి భారత్ - చైనా తో దోస్తీనే కోరుకొంటోంది. ఎందుకంటే ఆ దేశ కంపెనీలు ఇటీవల మన దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అమెరికా కు ఎగుమతి చేసే వస్తువులను భారత్ లో తయారు చేసి వాటికి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ వేయాలని చైనా యోచిస్తోంది. అందుకు భారత్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం.

స్టార్టప్ లో పెట్టుబడులు...
భారత స్టార్టప్ కంపెనీల్లో చైనా కంపెనీలు విపరీతంగా నిధులు కుమ్మరిస్తున్నాయి. ఇందుకు పెద్ద ఉదాహరణ పేటీఎం. చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా ... పేటీఎంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి పేటీఎంలో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. పేరుకే పేటీఎం భారత కంపెనీ కానీ దాని ఓనర్ మాత్రం చైనాకు చెందిన అలీబాబానే కావటం గమనార్హం. అలాగే బిగ్ బాస్కెట్. ఈ కంపెనీల్లోనూ రూ 2,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి అలీబాబా మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. ఎలాగు టిక్ టాక్ వంటి ఆప్ లతో చైనా నేరుగా కూడా ఇండియన్స్ కు దగ్గరైపోయింది. మరో వైపు మన దేశంలో అమ్ముడవుతున్న మూడో వంతు మొబైల్ ఫోన్లు చైనా కంపెనీలకు చెందినవే ఉన్నాయి. దీంతో 90% భారత పౌరుల సమాచారం ప్రస్తుతం వాటి చేతికి చిక్కింది. ఇది దేశానికి భద్రతా ముప్పు అని నిపుణులు సందేహాలు వ్యక్తం చేసినా... నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం చైనాకు జై కొడుతోంది. చూడాలి ముందు ముందు ఏం జరగనుందో!
More From GoodReturns

Success story: రూ. 600 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టాడు!

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications