ఇంటి అద్దెల నుంచి కంపెనీల ఒప్పందాల వరకు ప్రతి దానికీ ఒక కాంట్రాక్టు (ఒప్పందం) ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో ఆయా ఒప్పందాలను ఉల్లంఘించటం చూస్తుంటాం. అంటే వివాదం నెలకొనటం. వివాదాల పరిష్కారం కోసం అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సార్లు వివాదాలను ఇరువురు పార్టీలు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటాయి. కానీ ఇలాంటివి కేవలం 5 % నుంచి 10% లోపే. చాలా సందర్భాల్లో మాత్రం వివాదాలు కోర్టులకు లేదా ట్రిబ్యునల్స్ కు వెళుతుంటాయి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే కాక... వెంటనే తేలవు. ఏళ్ళ తరబడి వేచి చూడాల్సి వస్తుంది.
ఒక ఇంటి అద్దె విషయంలో నెలకొన్న వివాదంలో కోర్టును ఆశ్రయిస్తే... అది తేలేవరకు ఒక ఇంటిని కొనుగోలు చేసేంత ఖర్చు అవుతుందని కొన్ని జోకులు కూడా ఉన్నాయి. ఇందులో వాస్తవం కూడా లేకపోలేదు. వివాదం చిన్నదా... పెద్దదా అనే తేడా లేకుండా దాని పరిష్కారానికి పట్టే సమయం మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఇటీవల కోర్టులు ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం) సూచిస్తున్నాయి. ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ఒక న్యాయ నిపుణుడు ఇరువురి వాదనలు విని తీర్పునిస్తారు. సదరు తీర్పు ఇద్దరికీ నచ్చితే.. దానిని కోర్టులో నమోదు చేసి, వివాదం పరిష్కారం అయినట్లు పేర్కొంటారు. దీంతో సమయం కలిసివస్తుంది. కోర్టులపై ఒత్తిడి తగ్గుతుంది. కానీ బాగా డబ్బు ఖర్చు అవుతుంది. అందుకే ఇటీవల కొన్ని కంపెనీలు కొత్త విధానాలు అనుసరిస్తున్నాయి.

నెస్ట్ అవే ...
అవసరమే నవకల్పనలకు మార్గం చూపుతుందని అంటారు. సరిగ్గా అలాగే రెంటల్ హోమ్ సర్వీసెస్ లో నిమగ్నమైన నెస్ట్ అవె అనే స్టార్టుప్ కంపెనీ తమ వినియోగదారుల కోసం ఒక సరికొత్త వివాద పరిష్కార వేదికను సిద్ధం చేసింది. తమ సేవలు తీసుకుంటున్న సుమారు 75,000 మంది వినియోగదారులకు ఇది వర్తిస్తుంది. ప్రధానంగా ఇంటి యజమాని, అద్దెకు ఉండే వారి మధ్య వివాదం నెలకొంటుంది. రెంట్ విషయం లో కానీ... సౌకర్యాలు, ఇతరత్రా అంశాల్లో ఇవి ప్రధానంగా మొదలవుతాయి. ఇలాంటి వాటికోసం కోర్టులు, ట్రిబ్యునల్స్ ను ఆశ్రయించటం వల్ల డబ్బు, విలువైన సమయం వృధా అవుతున్నాయని నిర్వహించిన నెస్ట్ అవె వారికోసం ఒక వెబ్ ఆధారిత వివాద పరిష్కార వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో ఈ విషయాన్నీ వెల్లడించింది. ఈ విధానంలో రెండు పార్టీలు, ఆన్లైన్ వేదికగా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ మెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ లలో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవటం, అవసరమైతే... వీడియో కాల్ లో మాట్లాడుకోవటం చేస్తున్నారు. దీంతో అటు సమయం, ఇటు డబ్బు అదా అవుతోంది.
పే పాల్...
వెబ్ ఆధారిత వివాద పరిష్కారం మనకు కొత్త కానీ ... ఇలాంటి విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో అందుబాటులో ఉంది. పే పాల్ వంటి పేమెంట్ సేవలు అందించే సంస్థలు వాటి వినియోగదారులకు ఆన్లైన్ లోనే సమస్య పరిష్కారాన్ని చూపుతాయి. సేవ లోపం, ఉత్పత్తి లో లోపాలు ఉంటె సదరు వినియోగదారు నేరుగా పే పాల్ లో ఒక కేసు రిజిస్టర్ చేస్తారు. ఆ కేసుతో సంబంధం ఉన్న వినియోగదారునికి పే పాల్ కేసు వివరాలు తెలుపుతుంది. అలాగే ఆ వివాదానికి సమానమైన సొమ్మును బ్లాక్ చేసి, వివాదం పరిష్కారం ఐన తర్వాత దానిని విడుదల చేస్తుంది. దీంతో చాలా వేగంగా సమస్య పరిష్కారం అయిపోతుంది. ఒక వేల దీనికి ఎవరైనా ఒక పార్టీ ఒప్పుకోకపోతే... వారి అకౌంట్ బ్లాక్ లిస్ట్ లో పెడతారు. అంటే ఇకముందు పే పాల్ లో వారు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా చూస్తారు. అందుకే వినియోగదారులు కూడా వీలైనంత త్వరగా వివాదాలను పరిష్కరించుకుని ముందుకు వెళతారు.
లక్షల్లో పెండింగ్ కేసులు...
దేశంలో చిన్నా పెద్ద వివాదాలు కొన్ని లక్షల్లో పెండింగ్ లో ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది కోర్ట్ మార్గం లో వివాద పరిష్కారానికి అవకాశం ఉన్నా... కేసుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం దేశంలోని హై కోర్టుల్లో 45.6 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయి. జిల్లా కోర్టుల కు వచ్చే సరికి ఆ సంఖ్య 3.15 కోట్లకు పెరిగింది. వివిధ జాతీయ స్థాయి ట్రిబ్యునల్స్ లో మరో 3,50,000 వివాదాలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. వీటన్నిటికీ కొంత చెక్ పెట్టాలంటే... టెక్నాలజీ ని విరివిగా వినియోగించాల్సిందేనని, అది మాత్రమే అటు డబ్బు, ఇటు సమయాన్ని అదా చేసి వేగవంతమైన పరిష్కారాలను చూపగలదని నిపుణులు అభిప్రాయతుడుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications