వన్ ప్లస్ సహ వ్యవస్థాపకులు కార్ల్ పీ ఆ సంస్థను వదిలి పెట్టారు. కార్ల్ పీ తన సొంత సంస్థను స్థాపించడానికి వన్ ప్లస్‌ను విడిచి పెట్టినట్లుగా తెలుస్తోంది. వన్ ప్లస్ 8టీ ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సమయంలో అతను వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి వన్ ప్లస్ లేదా కార్ల్ పీ నుండి ప్రకటన వెలువడాల్సి ఉంది. అతని ట్విట్టర్ ఖాతా బయోలో ఇప్పటికీ వన్ ప్లస్ ఉంది. కొన్నేళ్ల క్రితం ప్రారంభమైన వన్ ప్లస్ ఇప్పుడు మార్కెట్లో దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే.

ఏడేళ్ల తర్వాత గట్టి దెబ్బ
వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి చేరిన ఏడేళ్ల తర్వాత ఆ కంపెనీలో ఇది భారీ కుదుపుగా చెప్పవచ్చు. కార్ల్ పీ వెళ్లిపోవడం కంపెనీకు గట్టి దెబ్బగా భావిస్తున్నారు. కార్ల్ పీ కంపెనీ నుండి తప్పుకోనున్నట్లు రెడ్డిట్ యూజర్ జోన్ సిగుర్ తన ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కార్ల్ పీ స్థానంలో ఎమిలీడై వన్ ప్లస్ కార్యకలాపాలను చూడనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎమిలీడై భారత్ వన్ ప్లస్ కార్యకలాపాలు చూస్తున్నారు. ఇప్పుడు వారే ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు చూడనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం తెలియాలంటే అధికారిక ప్రకటన రావాలి.

సొంత సంస్థ కోసం
ఆయన కంపెనీని వీడింది వాస్తవమే అయితే.. అదే విధంగా కార్ల్ పీని వారే తొలగించారా లేక ఆయనే కంపెనీని వదిలి పెట్టారా తెలియాలి. అతనిని తొలగించారని చెబుతూనే, పరస్పర సమ్మతితో ఇది జరిగి ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. కార్ల్ పీ వన్ ప్లస్‌ను వీడిన తర్వాత సొంత సంస్థను ఏర్పాటు చేయనున్నారని కూడా వార్తలు వచ్చాయి.

పెట్టుబడిదారులతో చర్చలు
కార్ల్ పీ తన సొంత సంస్థ స్థాపించడం కోసం పెట్టుబడిదారులతో చర్చలు కూడా జరుపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కొత్త వెంచర్ గురించి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే కార్ల్ పీ కొత్త సంస్థ స్మార్ట్ ఫోన/టెక్నాలజీ కంపెనీ అయి ఉంటుందా అనే చర్చ సాగుతోంది. కాగా, చైనాలోని షెన్‌జెన్ ఆధారంగా వన్ ప్లస్‌ను షీట్ లా, కార్ల్ పీలు 2013లో స్థాపించారు. అక్టోబర్ 14న వన్ ప్లస్ 8టీ స్మార్ట్ ఫోన్ విడుదలవుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications