For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జపాన్ స్టాక్ మార్కెట్లో హార్డ్‌వేర్ సమస్య, 6 ట్రిలియన్ డాలర్ల ప్రభావం

|

టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ వాణిజ్య వ్యవస్థకు కీలకమైన డేటా పరికరం పని చేయలేదు. అంతేకాదు, ఆటోమేటిక్ బ్యాకప్ కూడా వెంటనే ప్రారంభం కాలేదు. దీంతో జపాన్ మార్కెట్ పైన భారీ దెబ్బ పడింది. 1999 నుండి పూర్తి ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టంకు మారింది. అప్పటి నుండి ఒకరోజు పూర్తి షట్ డౌన్ చోటు చేసుకుంది. ఈ సంఘటన గురువారం ఉదయం గం.7.04కు జరిగింది.

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌కు సాంకేతిక సమస్యలు రావడం గమనార్హం. ఈక్విటీ మార్కెట్ ఆర్డర్స్ ప్రాసెస్ ప్రారంభించడానికి గంట కంటే తక్కువ సమయం ఉంది. ఆ సమయంలో హార్డ్‌వేర్ సమసంయ తలెత్తడంతో 6 ట్రిలియన్ డాలర్ల మేర మార్కెట్ పైన ప్రభావం పడింది. ఎక్స్చేంజ్ అధికారులు కూడా ఏం చేయలేకపోయారు.

కరోనా దెబ్బ, డిపాజిట్లపై బ్యాంకుల్లో తగ్గిన వడ్డీరేటు: ఈ పథకాల్లో రాబడి ఎక్కువ.. కానీ!కరోనా దెబ్బ, డిపాజిట్లపై బ్యాంకుల్లో తగ్గిన వడ్డీరేటు: ఈ పథకాల్లో రాబడి ఎక్కువ.. కానీ!

యంత్రాలు.. ఎప్పుడైనా సమస్య

యంత్రాలు.. ఎప్పుడైనా సమస్య

హార్డ్‌వేర్ సమసమయ కారణంగా స్టాక్ మార్కెట్‌పై భారీ ప్రభావం పడటంతో మార్కెట్ భాగస్వాములు, అధికారులు తదితరుల నుండి విమర్శలు వచ్చాయి. సాఫ్టువేర్ సమస్య లేదా భద్రతా సమస్య కాకుండా వాణిజ్య వ్యవస్థలో ఉన్న వందలాది హార్డ్‌వేర్‌లలో ఒక్కదాంట్లో సమస్య తలెత్తినా మార్కెట్‌కు ఇబ్బందికరంగా మారింది. మనం యంత్రాలతో ముందుకు సాగుతున్నామని, వాటి వల్ల ఎప్పుడైనా సమస్య తలెత్తే అవకాశాలు ఉంటాయని, కాబట్టి ఆ దిశగా ఆలోచించి మౌలిక సదుపాయాలు సృష్టించాల్సిన అవసరం ఉందని ఆ దేశ ఆర్థిక మంత్రిటారో ఆసో టోక్యోలో అన్నారు.

టోక్యో ఎక్స్చేంజీలో 2010లో కొత్త సిస్టం

టోక్యో ఎక్స్చేంజీలో 2010లో కొత్త సిస్టం

టోక్యో స్టాక్ ఎక్స్చేంజీ(TSE) ఆరో సిస్టంను 2010లో లాంచ్ చేసింది. ఇది క్యాష్ ఈక్విటీ ట్రేడింగ్ సిస్టంగా ప్రారంభించారు. తక్కువ సమయం, విశ్వసనీయత పెంపు, ప్రపంచ ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఆర్డర్ ట్రాఫిక్‌లో పెరుగుతున్న ఆర్డర్స్‌కు అనుగుణంగా 2019 నవంబర్ 5న దీనిని అప్ డేట్ చేశారు. అంతకుముందు పలు సాంకేతిక సమస్యలకు పరిష్కార సాధనంగా పదేళ్ల క్రితం ప్రారంభించినప్పుడు దీనిని పేర్కొన్నారు. ఈ సిస్టంలో 350కి పైగా సర్వర్లు ఉన్నాయి. నిత్యం కొనుగోళ్ళు, అమ్మకాల ఆర్డర్స్‌తో ఉండే ఈ వ్యవస్థకు మొదటి దశాబ్దంలో (ప్రారంభించిన 2010 జనవరి 10) చిన్న సమస్యలు వచ్చినప్పటికీ, ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద సమస్య రాలేదు.

గురువారం ఏం జరిగింది?

గురువారం ఏం జరిగింది?

గురువారం నెంబర్ 1 షేర్డ్ డిస్క్ డివైస్ అని పిలువబడే హార్డ్‌వేర్‌లో మెమొరీ ఎర్రర్‌ను గుర్తించారు. ఇవి డేటా స్టోరేజ్ బాక్సుల్లో ఒకటి. ఈ పరికరాలు సర్వర్‌లలో ఉపయోగించిన నిర్వహణ డేటాను స్టోర్ చేస్తాయి. ట్రేడింగ్‌ను పర్యవేక్షించే టెర్మినల్స్ కోసం ఆదేశాలు, ఐడీ, పాస్‌వర్డ్ కలయికల వంటి సమాచారాన్ని పంపిణీ చేస్తాయి. ఇందులో ఎర్రర్ వస్తే కనుక 2వ డివైస్ వెంటనే ఆటోమేటిక్‌గా స్విచ్ ఆన్ కావాలి. అది కూడా విఫలమైంది. ఏం జరిగిందో ఎక్స్చైంజ్ అధికారులు వెల్లడించలేకపోయారు. ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ గేట్‌వేస్ అని పిలువబడే సర్వర్లపై ప్రభావం పడింది. ఇది మార్కెట్ సమాచారాన్ని ట్రేడర్స్‌కు పంపించేందుకు ఉపయోగపడుతుంది.

English summary

జపాన్ స్టాక్ మార్కెట్లో హార్డ్‌వేర్ సమస్య, 6 ట్రిలియన్ డాలర్ల ప్రభావం | one piece of hardware took down Japan's $6 trillion stock market

A data device critical to the Tokyo Stock Exchange’s trading system had malfunctioned, and the automatic backup had failed to kick in. It was less than an hour before the system, called Arrowhead, was due to start processing orders in the $6 trillion equity market. Exchange officials could see no solution.
Story first published: Monday, October 5, 2020, 15:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X