భారతావనిలో అత్యంత క్లిష్టమైన సవాల్.. నిర్మలమ్మ ముందు

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో క్లిష్ట పరిస్థితుల్లో బడ్జెట్ తయారీలో సవాళ్లు ఉన్నప్పటికీ బంగారం వంటి అవకాశాలు ఉంటాయని మాజీ చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ శంకర్ ఆచార్య అన్నారు. 2021-22 బడ్జెట్ కొన్ని వారాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటి వరకు ఏ ఆర్థిక మంత్రి ఎదుర్కోని సవాల్ ఇప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరోనా ఆర్థికంగా అత్యంత పెనుసవాళ్లను విసిరింది. స్వతంత్ర్య భారతంలో అతి క్లిష్టమైన సవాల్‌ను ఎదుర్కొంటోంది నిర్మలమ్మే అని అంటున్నారు.

కోలుకుంటున్న భారతావని

కోలుకుంటున్న భారతావని

కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ మైనస్ 23.9 శాతంగా నమోదయింది. ఇప్పటికి కేసులు కోటి దాటాయి. కరోనా నుండి మూడు నాలుగు నెలలుగా కోలుకుంటుండటంతో ఆర్థిక కార్యకలాపాలు కాస్త పెరిగాయి. అందుకే రెండో త్రైమాసికంలో జీడీపీ ఊహించిన క్షీణత కంటే కాస్త తగ్గింది. మైనస్ 9 శాతం దాటుతుందని అంచనా వేయగా, మైనస్ 7.5 శాతంగా నమోదయింది. రిటైల్ ద్రవ్యోల్భణం చాలా నెలలుగా ఆరు శాతం కంటే పైన ఉంది. ఉపాధి రేటు క్యూ2లో 38 శాతం కంటే తక్కువగా ఉంది. క్యూ1లోని 31 శాతం కంటే మెరుగుపడింది.

Q2, Q3 సానుకూలంగా...

Q2, Q3 సానుకూలంగా...

కేంద్ర ఆర్థిక లోటు... జీడీపీలో 8 శాతంగా ఉంటుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకుంటే 12 శాతం నుండి 13 శాతంగా నమోదు అవుతుంది. ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో ఆదాయాలు భారీగా పడిపోవడంతో ప్రభావం పడింది. మర్చంటైజ్డ్ ఎగుమతి వృద్ధి ఇప్పటికీ ప్రతికూలంగా ఉంది. నెలవారీ డాలర్ స్థాయిలు 2011-12 స్థాయికి పడిపోయింది. దిగుమతులు తగ్గాయి. చమురు ధరలు తగ్గడంతో మిగులు ఖాతా నమోదయింది. మూడు, నాలుగో త్రైమాసికాల్లో జీడీపీ వరుసగా 0.1 శాతం, 0.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. FY21, FY22 రియల్ జీడీపీ, ద్రవ్యోల్భణం వంటివి అనిశ్చితిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతమైన బడ్జెట్ తయారీ పెద్ద సవాల్ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

అంచనాలు ఇలా..

అంచనాలు ఇలా..

ఆర్బీఐ, ఆర్థిక శాఖలు Q2, Q3లపై సానుకూల ధోరణితో ఉన్నాయి. అయితే Q2, Q3లలో గతంలో కంటే సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూలంగానే ఉండే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. 2020-2021 రెండో అర్ధ సంత్సరంలో 0.4 శాతం పాజిటివ్ వృద్ధిని ఆర్బీఐ అంచనా వేస్తుంటే, మైనస్ 2-4 శాతంగ అంచనా వేస్తున్నారు శంకర్ ఆచార్య. 2020-2021 పూర్తి సంవత్సరానికి ఆర్బీఐ మైనస్ 7.5 శాతంగా అంచనా వేస్తుండగా, శంకర్ ఆచార్య మైనస్ 9-10 శాతం అంచనా వేస్తున్నారు. వాస్తవానికి 2021-2022లో రీబౌండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉందని అంటున్నారు. 10 శాతం నుండి 11 శాతంగా ఉంటుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+