కరోనా మహమ్మారి కారణంగా విమానయానం, ఆతిథ్య రంగాలపై భారీ ప్రభావం చూపిస్తోంది. ఆటో, ఐటీ సెక్టార్‌లు కూడా నష్టపోతున్నాయి. లాక్ డౌన్ సమయంలో, ఆ తర్వాత కూడా ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వివిధ సాఫ్టువేర్ దిగ్గజాలు కొత్త నియామకాలు మాత్రమే ఉండవని, ఉద్యోగాల తొలగింత మాత్రం ఉండదని స్పష్టం చేశాయి. ఇన్ఫోసిస్ మాజీ సీఈవో క్రిస్ గోపాలకృష్ణన్ కూడా మరో గుడ్‌న్యూస్ చెప్పారు ఐటీ రంగంలోని ఉద్యోగులకు.

భారీ తొలగింపులు ఉండవ్, కానీ ఈ రెండు మాత్రం..
ఐటీ రంగంలో భారీ తొలగింపులు లేవని, కానీ ఏడాది పాటు మాత్రం నియామకాలు నెమ్మదిస్తాయని క్రిస్ గోపాలకృష్ణన్ అన్నారు. రెండోది శాలరీ కోత ఉంటుందన్నారు. లాక్ డౌన్ తర్వాత పది పన్నెండు లక్షల మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల కోత లేనప్పటికీ వేతనాల కోత మాత్రం ఉంటుందన్నారు. ఇప్పటికే దిగ్గజాలు సహా ఐటీ రంగంలోని అన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఇది లాక్ డౌన్ తర్వాత కొనసాగుతుందని చెప్పారు.

ఏడాది పాటు కరోనా ప్రభావం.. వీరికి ఇబ్బంది
కరోనా ప్రభావం సంవత్సరం నుండి ఏడాదిన్నర పాటు ఉండవచ్చునని, అప్పటి వరకు నియామకాలు మాత్రం నెమ్మదిస్తాయని చెప్పారు. అవసరమైతే అసలు నియామకాలు పూర్తిగా ఉండకపోవచ్చునని చెప్పారు. తమ కంపెనీల వృద్ధికి అనుగుణంగా కంపెనీల కొత్త నియామకాలు చేపడతాయని చెప్పారు. కరోనా ప్రభావం ఉన్నంత కాలం వృద్ధిపై ప్రభావం ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది, వచ్చే ఏడాది పాసవుట్ స్టూడెంట్స్‌కు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు.

గతం కంటే భిన్నంగా ప్రతి ఉద్యోగి కోతనంలో వేత..
కరోనా కారణంగా ప్రపంచ దేశాలు, భారత వృద్ధి రేటు సున్నా, మైనస్‌లకు వెళ్లి పోతున్న పరిస్థితుల్లో వేతనాల్లో కోత, కొత్త నియామకాలపై ప్రతికూల ప్రభావం తప్పదన్నారు. ఐటీ సహా అన్ని రంగాలకు ఇది వర్తిస్తుందన్నారు. దాదాపు ప్రతి ఉద్యోగికి శాలరీలో కోత ఉండవచ్చునని, అప్పుడు భారం తగ్గి ప్రతి ఉద్యోగిని కొనసాగించవచ్చునని తెలిపింది. గతంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులకు కోతలు ఉండేవి కావని, పదవులు పెరుగుతున్న కొద్ది ఆ లెక్కన కోతలు విధించే వారన్నారు. ఇప్పుడు కొన్ని సంస్థల్లో అందరికీ కోత తప్పకపోవచ్చునని అభిప్రాయపడ్డారు.

వర్క్ ఫ్రమ్ హోమ్‌లో చిన్న కంపెనీలదే జోరు
లాక్ డౌన్ నేపథ్యంలో ఐటీ, బీపీవో రంగాల్లో చాలామంది ఇంటి నుండి పని చేస్తున్నారని, ఇదే విధానం ఆ తర్వాత కూడా కొనసాగుతుందని క్రిస్ గోపాలకృష్ణన్ చెప్పారు. ఈ రంగంలోని 40 లక్షల మంది ఉద్యోగుల్లో 10 నుండి 12 లక్షల మంది లాక్ డౌన్ తర్వాత ఇంటి నుండే పని చేయవచ్చునని చెప్పారు. పెద్ద కంపెనీల కంటే చిన్న కంపెనీలే ఈ విధానానికి త్వరగా మారుతున్నాయని చెప్పారు. వ్యయాలు తగ్గడం చిన్న కంపెనీలకు కలిసి వస్తోందన్నారు.

ఇంటి నుండి బాగా పని చేస్తున్నారు
ఇంటి నుండి సమర్థవంతంగా పని చేస్తున్న తరుణంలో ప్రత్యేకంగా ఆఫీస్ ఎందుకు అని చాలా చిన్న కంపెనీలు యోచిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఐటీ సేవలు అందించే సంస్థలు కూడా ఇదే ఆలోచన చేస్తాయని చెప్పారు. మొత్తానికి ఉద్యోగాల కోత లేనప్పటికీ నియామకాలు నెమ్మదించడం, శాలరీ తగ్గడం, పాసవుట్ విద్యార్థులకు ఉద్యోగాలు లేకపోవచ్చునని అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications