విదేశాల్లో స్థిరపడటం అనేది చాలా మందికి కలల జీవితంగా కనిపించవచ్చు. మెరుగైన వేతనం, జీవన ప్రమాణం, అవకాశాలు ఇవన్నీ ఆకర్షణీయంగా అనిపిస్తాయి. అయితే ఆ కలల జీవితం అన్నిటికీ పరిష్కారం కాదనేది ఇప్పుడు అదే ఎదుర్కొంటున్నది ఒక 28 ఏళ్ల NRI యువతి. ఇండియాలో నాన్-టెక్ రంగంలో రూ. 16 లక్షల జీతంతో సంతృప్తిగా పనిచేస్తున్న ఈ యువతి, మంచి భవిష్యత్తు ఆశిస్తూ రెండేళ్ల క్రితం కెనడాకు మైగ్రేట్ అయింది.

ఆ తర్వాత అక్కడ రిమోట్‌గా ఉద్యోగం దొరకడంతో అనుకున్నట్టే లైఫ్ సెట్ అయిందనిపించింది. కానీ కాలక్రమంలో ఆమె కెరీర్ అభివృద్ధికి అవకాశాలు లేకపోవడం, జీతం అంతే ఉండటం వంటివి లోచనలకు లోనయ్యేలా చేశాయి. కెనడాలో ప్రస్తుతం ఆమె సంవత్సరానికి CAD 82,000(రూ. 52 లక్షలు) సంపాదిస్తుంది. కానీ అది తగినంతకాదని, రెండు సంవత్సరాల్లో తగిన ప్రొఫెషనల్ గ్రోత్ లేదని చెబుతుంది.
మరింత క్లిష్టంగా మారిన విషయం ఏమిటంటే, ఆమె భాగస్వామి కెనడాలో యానిమేషన్ రంగంలో CAD 90,000 (రూ. 56 లక్షలు) సంపాదిస్తున్నా ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయాడు. భారతదేశంలో యానిమేషన్ రంగం మరింత స్థిరత్వం లేకుండా ఉండటంతో తిరిగి ఇండియాకు రావాలన్న ఆలోచనపై స్పష్టత లేదు. "ఒక్కసారి తిరిగి వచ్చాక, నా జీతంతో ఇద్దరం జీవించగలమా? రిటైర్మెంట్ వరకూ సపోర్ట్ చేయగలమా?" అనే ఆత్మవిమర్శ ఆమెను వెంటాడుతోంది.
ఈ పోస్ట్‌పై ఇంటర్నెట్‌లో స్పందనలు విపరీతంగా వచ్చాయి. కొందరు ఆమెకు AI లాంటి రంగాల్లో స్కిల్ల్స్ డెవలప్ చేయమని సూచించగా, మరికొందరు "ఇప్పుడు కెనడా ఫైనాన్షియల్‌గా లాభదాయకంగా లేదు. తిరిగి ఇండియాకు వస్తే మంచిదే" అంటూ స్పష్టంగా చెప్పారు. ఇంకొందరు మాట్లాడుతూ, "ఇమ్మిగ్రెంట్ జీవితం తొలిలో కష్టమే. కానీ కెనడా ప్రస్తుతం ట్రాన్సిషన్‌లో ఉంది. జీతాల పరంగా అనుభవం ఉన్నవాళ్లకు కూడా మంచి స్కోప్ కనిపించడం లేదు" అన్నారు. మరికొందరు, "ఇండియాకు రావడం అన్నదే పరిష్కారం కాదు. కెనడాలోనే ఇంకొన్ని సక్రమమైన ఉద్యోగాలు ట్రై చేయండి. లైన్ మార్చినా, జాబ్ మార్కెట్‌ను డైనమిక్‌గా అర్థం చేసుకుంటే అవకాశాలుంటాయి" అని చెప్పారు.
కొందరు ఆమె భాగస్వామికి వాంకోవర్ వంటి నగరాల్లో యానిమేషన్ రంగంలో అవకాశాలుంటాయని చెప్పడంతో పాటు, ఇండియాలో యానిమేషన్ రంగంలో ఉన్న వేతన అసమతుల్యత, టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి కూడా వివరించారు. ప్రస్తుతం ఎన్నో NRIలు విదేశాల్లో ఉన్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుండటం, కొత్త రంగాలలో (టెక్నాలజీ, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, స్టార్టప్‌లు) అవకాశాలు పెరగడం అంతేకాక, ఇంటర్నేషనల్ అనుభవం కలిగిన వారికి భారత కంపెనీలు, MNCలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వీటన్నిటి వల్ల తీసుకునే ప్రతి నిర్ణయం ముందు, కేవలం భావోద్వేగాలకు లోనవకుండా డేటా, కెరీర్ అవకాశాలు, ఆర్థిక స్థితిగతులపై సమగ్ర విశ్లేషణ చేసి తీర్మానం చేయడం మంచిది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications