నోకియా ప్రెసిడెంట్, సీఈవో పదవికి భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి రాజీనామా చేశారు. ఆయన 25ఏళ్ల పాటు సేవలు అందించారు. ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో రాజీనామా లేఖను సమర్పించినట్లు నోకియా వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్ట్ 31వ తేదీతో ఆయన పదవీ కాలం ముగియనుంది. రాజీవ్ సూరి స్థానంలో పెక్కా లుండామర్క్ పేరును కంపెనీ ఖరారు చేసింది.
పెక్కా లుండామర్క్ సెప్టెంబర్ నెలలో బాధ్యతలు తీసుకోనున్నారు. నోకియా సీఈవో మార్పు ప్రకటన నేపథ్యంలో హెల్సింకిలో కంపెనీ షేర్లు 4.9 శాతం మేర లాభపడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సీఈవో మార్పు మార్కెట్లకు పాజిటివ్‌గా ఉందని, నోకియాలో భారీ మార్పులు రావాల్సి ఉన్నవని, ఇది మేనేజ్‌మెంట్ నుండి ప్రారంభమవుతోందని ఓ అనలిస్ట్ పేర్కొన్నారు.

రాజీవ్ సూరి భారతీయ మాలాలు ఉన్న సింగపూర్ పౌరుడు. నోకియా ప్రధాన కార్యాలయం ఫిన్‌లాండ్‌లోని ఎస్బూలో నివసించే రాజీవ్ సూరికి పాతికేళ్ల అనుభవం ఉంది. 1995లో ఆయన నోకియాలో చేరారు. 2014 ఏప్రిల్ 29న రాజీవ్ సూరి నోకియా సీఈవోగా అపాయింట్ అయ్యారు. స్టీఫెన్ ఎలోప్ తర్వాత రెడో నాన్ ఫినిష్ సీఈవో ఇతను. రాజీవ్ సూరి సీఈవోగా తప్పుకుంటున్నట్లు మార్చి 2, 2020న నోకియా ప్రకటించింది. సెప్టెంబర్ 1, 2020న బాధ్యతలు మారుతాయి. మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాల్లో నోకియా కార్యకలాపాలకు సంబంధించి విలీనాలు, కొనుగోళ్లు, ప్రోడక్ట్ మార్కెటింగ్, సేల్స్ తదితర విభాగాల్లో పని చేశారు.


Click it and Unblock the Notifications