For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీతో మార్కెట్ అప్, కిందకు పడేసిన రిలయన్స్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (అక్టోబర్ 21) లాభాల్లో ముగిశాయి. అయితే ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ 162.94 పాయింట్లు(0.40%) లాభపడి 40,707.31 పాయింట్ల వద్ద, నిఫ్టీ 40.90 పాయింట్లు(0.34%) లాభపడి 11,937.70 పాయింట్ల వద్ద ముగిసింది. 1354 షేర్లు లాభాల్లో, 1269 షేర్లు నష్టాల్లో ముగియగా, 165 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. మెటల్ సూచీ 2 శాతం వరకు లాభపడింది. ఆ తర్వాత బ్యాంకింగ్, ఇన్ఫ్రా, ఎనర్జీ సూచీలు మంచి లాభాలు చూశాయి. ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

గూగుల్ బాటలోనే.. ఉద్యోగుల ఆరోగ్యం కోసం అమెజాన్ కీలక నిర్ణయంగూగుల్ బాటలోనే.. ఉద్యోగుల ఆరోగ్యం కోసం అమెజాన్ కీలక నిర్ణయం

ఈ స్టాక్స్ మార్కెట్‌కు ఊతమిస్తే, రిలయన్స్ కిందకు..

ఈ స్టాక్స్ మార్కెట్‌కు ఊతమిస్తే, రిలయన్స్ కిందకు..

గత గురువారం భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, ఆ తర్వాత వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. అంతకుముందు వరుసగా పది రోజులు లాభాలు నమోదు చేశాయి.

నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 163 పాయింట్ల లాభంతో ముగిసింది.

నిఫ్టీ బ్యాంకు ఒక శాతం లాభంలో ముగిసింది.

నిఫ్టీ బ్యాంకు 323 పాయింట్లు లాభపడి 24,635 వద్ద క్లోజ్ అయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు భారీ లాభాలు నమోదు చేశాయి.

మిడ్ క్యాప్ సూచీలు 42 పాయింట్లు స్వల్పంగా లాభపడి 17,065 వద్ద ముగిశాయి.

HDFC, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్ మార్కెట్‌కు దోహదపడగా, రిలయన్స్ కిందకు లాగింది.

బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో ముగిసింది. అల్ట్రా టెక్ సిమెంట్ రెండు శాతం లాభపడింది.

కోల్గేట్ 2 శాతానికి పైగా నష్టపోయింది.

బ్రిటానియా షేర్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. ఈ రోజు నాలుగు శాతం పడిపోయాయి.

టాప్ గెయినర్స్.. లూజర్స్

టాప్ గెయినర్స్.. లూజర్స్

ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి.

30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 21 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.

HDFC బ్యాంకు, HDFC, ICICI బ్యాంకు, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి.

వ్యాల్యూమ్ పరంగా రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ వ్యాల్యూమ్ టాపర్‌గా నిలిచాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిట్ కార్పోరేషన్, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, హిండాల్కో, గెయిల్ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో బ్రిటానియా, టీసీఎస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, హీరో మోటో కార్ప్, హెచ్‌డీఎప్‌సీ లైఫ్ ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

లాభాలకు కారణాలివే..

లాభాలకు కారణాలివే..

అమెరికా మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు వచ్చాయి. ఇది మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. నిఫ్టీ ఓ దశలో 12వేల పాయింట్లు దాటింది. అయితే మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఆరంభ లాభాలు చివరలో కోల్పోయాయి. ట్రేడింగ్ గరిష్టాల నుండి సెన్సెక్స్ 750 పాయింట్ల వరకు కోల్పోయింది. చివరకు మళ్లీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లో ముగిసింది.

టీసీఎస్ షేర్ ధర ఏకంగా 2.23 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.55 శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్ షేర్ ధర మాత్రం 0.81 శాతం లాభపడింది. రిలయన్స్ షేర్ ధర 1.54 శాతం నష్టపోయింది.

English summary

ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీతో మార్కెట్ అప్, కిందకు పడేసిన రిలయన్స్ | Nifty ends above 11,900, Sensex jumps 162 points amid high volatility

Among the sectors, metal index gained over 2 percent followed by the bank, infra and energy indices, while selling seen in the IT, auto and FMCG names.
Story first published: Wednesday, October 21, 2020, 18:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X