కరోనా వ్యాక్సిన్ ఎఫెక్ట్: లాభాల్లోనే దేశీయ మార్కెట్లు, వోడాఫోన్ ఐడీయాకు నష్టాలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాలను నమోదు చేశాయి. దీంతో వరుసగా ఐదో రోజు కూడా లాభాలు నమోదు చేసినట్లయింది. ప్రధానంగా కరోనా వ్యాక్సిన్‌పై ఆశలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత బలపడింది.
ఈ నేపథ్యంలో సెన్సెక్స్ సెన్సెక్స్ 511 పాయింట్లకు ఎగియగా, నిఫ్టీ కూడా మద్దతు స్థాయికి ఎగువన స్థిరంగా కొనసాగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ షేర్ల లాభాలు మార్కెట్లకు కలిసివచ్చాయి. సెన్సెక్స్ ముగింపు దశలో 11,150 పాయింట్ల వద్ద కొనసాగింది.

ఇక హెచ్‌డీఎఫ్‌సీ, ఐషర్ మోటర్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ లాభాలు నమోదు చేశాయి. విప్రో 2.64 శాతం, 3.52 శాతం ఎగిశాయి. జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్ కొంతమేర నష్టపోయాయి. 10 శాతం ఉద్యోగుల కోత ప్రకటనతో దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఆరంభంలో నష్టపోయినా.. తర్వాత కొద్దిగా పుంజుకుంది.
ఏప్రిల్-జూన్ కాలానికి బజాజ్ ఫైనాన్స్ లాభాలు 19 శాతం క్షీణించాయి. దీంతో షేరు 4 శాతం నష్టపోయింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి(ఏజీఆర్) బకాయిలపై సుప్రీంకోర్టు రిజర్వ్ ఆర్డర్ నేపథ్యంలో టెలికాం, స్టాక్స్ అమ్మకాలు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. వోడాఫోన్ ఐడియా 8 శాతానికిపైగా, భారతీ ఎయిర్ టెల్ ఒకశాతం మేర నష్టపోయాయి. కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు కూడా లాభాలు నమోదు చేశాయి.


Click it and Unblock the Notifications