న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపు అంశంపై బడ్జెట్‌లో ప్రతిపాదించిన రెండు పన్నుల విధానంపై చర్చ సాగుతోంది. పాత పన్ను విధానం మంచిదా, కొత్త పన్ను విధానం బెట్టరా అనేది ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే. దీనిపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఆదివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నాలు చేశారు. కొత్త ఆదాయపు పన్ను సంక్లిష్యంగా ఉందని పన్నుచెల్లింపుదారులు చెబుతుండగా... ఈ కొత్త పద్ధతి లాభదాయకమని ఆమె అంటున్నారు.

అలా ఐతే దీనిని ఎందుకు పరిచయం చేస్తాం..
ఆదివారం తమ బడ్జెట్ ప్రతిపాదనపై నిర్మలమ్మ మరింత స్పష్టత ఇచ్చే ప్రయత్నాలు చేశారు. అవసరమైతే కొత్త ఐటీ విధానంపై మరింత స్పష్టతను ఇస్తుందన్నారు. శనివారం ఈ అంశంపై స్పష్టను ఇచ్చామని, మరిన్ని అనుమానాలు ఉన్నా నివృత్తి చేస్తామన్నారు. పాత విధానం కంటే కొత్త విధానంలో ట్యాక్స్ పేయర్స్ ఎక్కువగా పన్ను కట్టవలసి వస్తే తాము ఈ విధానాన్ని ఎందుకు పరిచయం చేస్తామని ప్రశ్నించారు.

కొత్త విధానంతో కొందరికి లబ్ధి
అయితే ఈ క్రమంలో అందరికీ కాకపోయినా కొందరికి అయితే ఈ కొత్త పథకం లాభదాయకమని నిర్మల చెప్పారు. కొత్త విధానంలో అన్ని మినహాయింపులు ఉండవని చెప్పారు. కేవలం కొన్ని మినహాయింపులు మాత్రమే కలిపి కొత్త పథకం తెచ్చామన్నారు. కొత్త విధానం వల్ల కొన్ని స్లాబ్స్ వారికి తప్పకుండా లబ్ధి చేకూరుతుందన్నారు.

కొత్త విధానంపై ఎన్నో అనుమానాలు
పాత, కొత్త పన్ను విధానాల నేపథ్యంలో మినహాయింపులతో ఉండే పాత విధానంలో ఉండాలా లేక మినహాయింపులు లేని కొత్త విధానంలో ఉండాలా అనేది చాలామంది తేల్చుకోలేకపోతున్నారు. స్లాబ్స్ ఎంపిక అంశాన్ని పన్ను చెల్లింపుదారులకే ప్రభుత్వం విడిచి పెట్టింది. కొత్త విధానం ఎంచుకుంటే ఆ తర్వాత సంవత్సరాల్లోను దానినే కొనసాగించాల్సి ఉంటుందనే డౌట్స్ ఉన్నాయి. దీనిపై నిర్మలమ్మ స్పష్టత ఇచ్చే ప్రయత్నాలు చేశారు.

మినహాయింపులతోను కొందరికి లబ్ధి
ఆదాయపు పరిమితులను భారీగా తగ్గించినందున తప్పకుండా కొత్త విధానంలో కొన్ని స్లాబ్స్ వారికి లబ్ధి కలుగుతుందని, మినహాయింపులు ఉండవని తాను పదేపదే చెబుతున్నప్పటికీ కొత్త విధానంలోనూ కొన్ని కొనసాగుతాయని నిర్మల చెప్పారు. ఇక ఎన్నారైల విషయానికి వస్తే విదేశాల్లో సంపాదనపై పన్ను ఉండదని, భారత్‌లోని వారి ఆస్తులపై సంపాదనకు మాత్రమే ఉంటుందన్నారు. గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న నిజమైన కార్మికులు, మర్చంట్ నేవీ ఉద్యోగులకు ఈ నిబంధన వర్తించదన్నారు.

పన్ను విధానం..
తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. రూ.2.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదు. రూ.2.5 లక్షల నుంచి 5 లక్షలదాకా గతంలో మాదిరిగానే 5 శాతం పన్ను ఉంటుంది. అయితే రూ.5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు 10%, రూ.7.5 లక్షల నుంచి 10 లక్షలదాకా 15%, రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20%, రూ.12.5 లక్షల నుంచి 15 లక్షలదాకా 25%, రూ.15 లక్షలకుపైగా ఆదాయం ఉంటే 30% పన్నును ప్రకటించారు. ఏ పన్ను విధానంలో కొనసాగాలనేది ట్యాక్స్ పేయర్స్ ఇష్టం.

ఏది ప్రయోజనకరం
పాత విధానంతో వార్షిక ఆదాయం రూ.12 లక్షల లోపు ఉండి, ఏటా రూ.2 లక్షల వరకు మినహాయింపులు పొందుతున్న వారికి లబ్ధి ఉంటుందని చెబుతున్నారు. మొత్తం 5.78 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా ఇందులో 5.3 కోట్లమంది అంటే 90 శాతం మంది రూ.2 లక్షల లోపు మినహాయింపులు పొందుతున్నవారే. వార్షిక ఆదాయం రూ.13 లక్షల కంటే ఎక్కువగా ఉండే ధనిక వర్గాలకు కొత్త విధానం బెట్టర్ అంటున్నారు. ప్రస్తుతం వారు కూడా రూ.2 లక్షల లోపు వరకు మాత్రమే మినహాయింపులు పొందే అవకాశముంది. కొత్త విధానంలో మినహాయింపులు లేకపోయినా ప్రస్తుతం చెల్లించే దాని కంటే తక్కువ చెల్లిస్తారని చెబుతున్నారు.

పొదుపు తగ్గుతుందా?
ఈ కొత్త విధానం ద్వారా పన్ను ఆదా చేసే అవకాశాలు లేకపోవడంతో పాటు పొదుపు చేయాలన్న ఆసక్తి తగ్గుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధిక వేతనం ఉంటి.. మినహాయింపులు తక్కువగా లేదా లేకపోవడంతో పొదుపు చేయాలనే ఆసక్తి కోల్పోతారని అంటున్నారు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications